हिन्दी | Epaper

HDFC Bank: ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

Saritha
HDFC Bank: ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC Bank తన వినియోగదారుల కోసం తాజాగా కొన్ని కీలక అప్‌డేట్‌లను ప్రకటించింది. వీటిలో ప్రధానంగా లోన్ వడ్డీ రేట్లు (MCLR), ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), ఏటీఎం విత్ డ్రాయల్స్, లాకర్ ఛార్జీల వంటి మార్పులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అమల్లోకి రాగా మరికొన్ని ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకునే ముందు ఈ వివరాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Read Also: Agriculture : హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

HDFC Bank: ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
HDFC Bank: Big changes in HDFC from April 1!

లోన్ తీసుకునే వారికి ఊరట

HDFC Bank తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) 10 బేసిస్ పాయింట్ల (0.10%) వరకు తగ్గించింది. మార్చి 7, 2026 నుండి ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఓవర్‌ నైట్, వన్ మంత్ MCLR రేట్లు 8.25 శాతం నుండి 8.15 శాతానికి తగ్గాయి. అలాగే ఒక సంవత్సరం MCLR రేటు 8.40 శాతం నుండి 8.35 శాతానికి తగ్గింది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న పాత కస్టమర్ల EMI భారం కొంత మేర తగ్గే అవకాశం ఉంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ

మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పొదుపు చేసే వారికి HDFC Bank తీపి కబురు అందించింది. 3 ఏళ్ల 1 రోజు నుండి 4 ఏళ్ల 7 నెలల లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 6.40 శాతం నుండి 6.50 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు ఈ వడ్డీ రేటు ఏకంగా 7 శాతానికి చేరింది. సాధారణ కస్టమర్లకు ప్రస్తుతం 2.75% నుండి 6.50% వరకు.. సీనియర్ సిటిజన్లకు 3.25% నుండి 7% వరకు వడ్డీ లభిస్తుంది.

ఏప్రిల్ 1, 2026 నుండి ఏటీఎం వద్ద యూపీఐ (UPI) ద్వారా నగదు తీసుకుంటే దానిని కూడా నెలవారీ ఉచిత ఏటీఎం (ATM) లావాదేవీల పరిమితిలోనే లెక్కిస్తారు. ఒకవేళ ఉచిత పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి 23 రూపాయలు.. వాటిపై వర్తించే పన్నులను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

లాకర్ ఛార్జీల్లో మార్పులు

లాకర్ సౌకర్యం వాడుతున్న వారి కోసం బ్యాంక్ కొత్తగా ‘మెట్రో ప్లస్’ అనే కేటగిరీని ప్రవేశపెట్టింది. ప్రాంతాన్ని బట్టి (మెట్రో, అర్బన్, సెమీ-అర్బన్, రూరల్) , లాకర్ పరిమాణాన్ని బట్టి ఛార్జీలను సవరించింది. దీనిపై అదనంగా జీఎస్టీ కూడా వర్తిస్తుంది. మీ బ్రాంచ్ ఉండే ప్రాంతాన్ని బట్టి లాకర్ ఛార్జీలు మారే అవకాశం ఉంది. కాబట్టి మీ బ్రాంచ్ ఏ కేటగిరీలోకి వస్తుందో తెలుసుకుంటే మంచిది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

పెళ్లి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి

పెళ్లి వాహనం బోల్తాపడి ఇద్దరు మృతి

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త
1:13

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త

సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత

సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రి లోకేష్

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రి లోకేష్

గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం

గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం

📢 For Advertisement Booking: 98481 12870