దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్‌పీజీ సిలిండర్ల కొరత (LPG Shortage) ఇప్పుడు భారతీయ రైల్వేపై కూడా గట్టి ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రైలు ప్రయాణికులకు భోజన సదుపాయం కల్పించే IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసే ఆలోచనలో ఉంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటమే దీనికి ప్రధాన కారణం. ఒకవేళ వంట సేవలు నిలిచిపోతే.. ముందస్తుగా భోజనం బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు (Refund) రైల్వే సిద్ధమవుతోంది.
Supreme Court: హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు

ప్రయాణికుల కోసం ‘రెడీ టు ఈట్’ ప్లాన్
రైళ్లలో వడ్డించే భోజనాన్ని సాధారణంగా స్టేషన్ల వద్ద ఉండే ‘బేస్ కిచెన్ల’లో తయారు చేస్తారు. అక్కడి నుండి ప్యాంట్రీ కార్లలోకి భోజనాన్ని పంపిస్తారు. ప్యాంట్రీ కార్లలో కేవలం వేడి చేయడం వంటి పనులు మాత్రమే జరుగుతాయి. కాబట్టి అసలు వంట జరిగే బేస్ కిచెన్లకు గ్యాస్ అందకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో IRCTC మార్చి 10న తన క్యాటరింగ్ విభాగాలకు ఒక లేఖ రాసింది. అందులో గ్యాస్ కొరత ఉంటే వెంటనే ప్రత్యామ్నాయ వంట మార్గాలను (Alternate cooking modes) వెతుక్కోవాలని ఆదేశించింది. ప్రయాణికులకు ఆకలి బాధలు కలగకుండా ఉండేందుకు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్ రూమ్‌లు, ‘జన్ ఆహార్’ సెంటర్లలో తగినంత ‘రెడీ టు ఈట్’ (Ready to Eat – RTE) ఆహార పదార్థాలను నిల్వ ఉంచాలని IRCTC సూచించింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 17 లక్షల భోజనాలను ఐఆర్‌సీటీసీ అందిస్తుంది. ఇంత భారీ సంఖ్యలో ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా గ్యాస్ సరఫరా నిలిచిపోయిన చోట విద్యుత్ ఆధారిత వంట పరికరాలను వాడాలని సూచిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :