ఒక మహిళ తన కుమారుడితో కలిసి కుమార్తెకు విషం ఇచ్చి చంపింది. కుమార్తె ప్రియుడిని ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించింది. దర్యాప్తు చేసిన పోలీసులు అసలు నిందితులను అరెస్ట్ చేశారు. (Woman Poisons Daughter) ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గాజీపూర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల ఫర్జానాకు గత ఏడాది అక్టోబర్‌లో సోషల్ మీడియా ద్వారా సునీల్ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లి పేరుతో అతడు ఆమెను లోబర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఫర్జానా గర్భం దాల్చింది. సునీల్ ఆమెకు అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు.
Read Also: Hormuz Strait: హర్మూజ్ జలసంధి సమీపంలో యూఎస్ దాడులు

సునీల్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు
కాగా, అబార్షన్ వల్ల ఫర్జానా అనారోగ్యం చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి అయిన 48 ఏళ్ల అఫ్సానా కుమార్తెను ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఫర్జానా ఈ విషయాన్ని సునీల్‌కు చెప్పింది. దీంతో ఆమెను ఐదు రోజుల పాటు తన వద్ద ఉంచుకున్నాడు. అయితే తన కుమార్తె కనిపించడం లేదని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వెతికారు. మరోవైపు ఫిబ్రవరి 26న ఫతేపూర్ రైల్వే స్టేషన్‌లో ఫర్జానా అపస్మారక స్థితిలో కనిపించింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఆ యువతిని జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆమె సునీల్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఫర్జానాకు చికిత్స తర్వాత ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ప్రియుడిపై తల్లి అఫ్సానా పోలీసులకు ఫిర్యాదు
అయితే కుటుంబం ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించారు. మార్చి 1న అర్ధరాత్రి వేళ సునీల్ పొలానికి ఫర్జానాను ఆమె తల్లి, సోదరుడు తీసుకెళ్లారు. అక్కడ బలవంతంగా సల్ఫోస్ పౌడర్ తినిపించగా ఆమె మరణించింది. ప్రియుడు సునీల్ తన కుమార్తెను హత్య చేసినట్లు తల్లి అఫ్సానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ఫర్జానా మృతదేహానికి పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆమె హత్యపై దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్స్ వంటి ఆధారాలు పరిశీలించారు. అఫ్సానా, తన కుమారుడైన 26 ఏళ్ల అఫ్సర్‌తో కలిసి బలవంతంగా విషం తినిపించి కుమార్తెను చంపినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :