ఇరాన్ కొత్త సుప్రీం నేతగా మొజ్తాబా ఖమేనీ(Mojtaba Khamenei) ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడిలో మొజ్తాబా తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందారు. ఆ దాడిలోనే మొజ్తాబాకు గాయాలైనట్లు కొన్ని నివేదికలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ కుమారుడు స్పందించారు. మొజ్తాబా ఖమేనీ సురక్షితంగా, బలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మొజ్తాబా గాయపడినట్లు వార్తలు వచ్చాయని, అయితే అతనితో లింకున్న కొందరు మిత్రులను ఈ విషయాన్ని అడిగి తెలుసుకున్నానని, మొజ్తాబా క్షేమంగా ఉన్నట్లు వారు చెప్పారని అధ్యక్షుడి కుమారుడు యూసెఫ్ పెజెస్కియాన్ తెలిపారు.
Read Also: LPG cylinder theft : LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న యూసుఫ్ పెజెస్కియాన్ ఈ విషయాన్ని టెలిగ్రాం ఛానల్ ద్వారా వెల్లడించారు. ఖమేనీ మృతిచెందిన రోజే ఆ దాడుల్లో మొజ్తాబా కాళ్లకు గాయాలు అయినట్లు అమెరికాకుచెందిన న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నది. అయితే 56 ఏళ్ల మొజ్తాబా ఆదివారం కీలక ప్రకటన చేశారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :