Kukatpally Spa Raid: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఒక స్పా సెంటర్‌పై పోలీసులు పంజా విసిరారు. వెల్నెస్ మరియు స్పా పేరుతో వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో, సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ మరియు స్థానిక పోలీసులు మంగళవారం ఉమ్మడిగా ఈ దాడులు నిర్వహించారు.
Read Also: Mahabubabad crime: ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య
పోలీసుల వివరాల ప్రకారం
‘చామ్ వెల్నెస్’ (Charm Wellness) పేరుతో నిర్వహిస్తున్న ఈ సెంటర్‌లో విదేశీ మరియు ఇతర రాష్ట్రాల మహిళలతో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తేలింది. ఈ దాడిలో ముగ్గురు నిర్వాహకులు, ఆరుగురు మహిళలు మరియు ఒక విటుడు కలిపి మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి స్మార్ట్‌ఫోన్లు మరియు కొంత నగదును సీజ్ చేసినట్లు సీఐ సుబ్బారావు వెల్లడించారు. బాధితులను రెస్క్యూ హోమ్‌కు తరలించి, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: