हिन्दी | Epaper

AP ACB Raids: రాష్ట్రమంతా ఎసిబి సోదాలు

Rajitha
AP ACB Raids: రాష్ట్రమంతా ఎసిబి సోదాలు

విజయవాడ/గుంటూరు కార్పొరేషన్ : పట్టణ ప్రణాళిక విభాగంలో జరుగుతున్న అవినీతిపై అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు విస్తృతంగా ఏసీబీ ప్రత్యేక బృందాలు తనిఖీలను చేపట్టాయి. విజయవాడ నగరపాలక సంస్థలో అవినీతి ఆరోపణలు, అక్రమ లావాదేవీల ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, మరియు ఇంజనీరింగ్ విభాగాలపై దృష్టి సారించినట్లు సమాచారం.

Read also: Jana Sena Formation Day : జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

AP ACB Raids: ACB raids across the state

AP ACB Raids: ACB raids across the state

కార్యాలయాల్లో తనిఖీలు – ఫైళ్లు మాయం చేసేందుకు సిబ్బంది యత్నం

గత కొన్ని నెలలుగా ఆమోదం పొందిన బిల్డింగ్ ప్లాన్లు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, అక్రమ కట్టడాలకు సంబంధించిన నోటీసుల ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఆన్లైన్ దరఖాస్తుల డేటాను ఏసీబీ బృందం తనిఖీ చేస్తోంది. ప్రస్తుతం ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు ముగిసిన అధికారికంగా ఏసీబీ వివరాలు వెల్లడించనుంది. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ ఏఎస్పీ మహింద్ర మాత్రే తెలిపారు.

నిరంతర సోదాలు – కీలక పత్రాల పరిశీలన

టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కీలకపత్రాలు, రికార్డులు పరిశీలించాల్సిన నేపథ్యంలో రెండు రోజుల పాటు ఈ సోదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు కొనసాగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి ఎదురుకొంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులుపై కొందరు గోప్యంగా సమాచారం ఇచ్చారు. లంచాలు తీసుకుని అనుమతులు ఇస్తున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులను బయటకు కదలనివ్వకుండా రికార్డులు పరిశీలిస్తున్నారు.

ఒంగోలులో వినూత్న ఘటన – కిటికీల నుంచి నగదు విసిరివేత

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు వారికి వచ్చిన సమాచారం మేరకు అనిశా అధికారులు కార్యాలయం గదులు మూసి సిబ్బందిని బయటకు పోనివ్వకుండా పరిశీలన చేస్తున్నారు. భవన నిర్మాణాలలో అవినీతి ఆరోపణలు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుసుకొని టీపీఓ కార్యాలయ సిబ్బంది తమ వద్ద ఉన్న అదనపు డబ్బును కిటికీలనుంచి బయటకు విసిరివేసారు. ఇది గమనించిన ఏసీబీ అధికారులు ఆ నగదును సీజ్ చేశారు. టీపీఓ బాబూరావు, తన సిబ్బందిని తనిఖీలు నిర్వహించి, రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏసీబీ సీఐలు రమేశ్ బాబు, సురేశ్ బాబులు ఆధ్వర్యంలో ఈ తనిఖీలను నిర్వహించారు.

ఏడాదిన్నరగా నిద్ర పోయారా.. ఇప్పుడే మేల్కొన్నారా?: నగర ప్రజల ప్రశ్నలు

గుంటూరు కార్పొరేషన్ టౌన్ అక్రమాలపై కన్నెత్తి అయినా చూడని అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏడాదిన్నర కాలంగా నిద్రపోయారా? అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో నాన్ క్యాడర్ ఐఏఎస్ పరిపాలనలో అంతులేని అవినీతి అక్రమాలు జరిగాయని, నిబంధనలను పాటించిన ఓసి రిలీజ్ విషయంలో లక్షలాది రూపాయలు లంచాల రూపంలో పుచ్చుకున్నారనే ఆరోపణలు భారీగా వచ్చాయి. ఒక టౌన్ ప్లానింగ్ విభాగం మాత్రమే కాకుండా రెవిన్యూ, శానిటేషన్, జిఎంసి ఆర్టికల్చర్, ఇంజనీరింగ్ విభాగం వంటి కీలకమైన విభాగాల నుంచి విచ్చలవిడిగా లక్షలాది రూపాయలు ఆక్రమార్గంలో జేబులు నింపుకున్నారని ఆరోపణలు, భారీ ఎత్తున లంచాల వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

అనధికారిక కట్టడాలు – అధికారుల తీరుపై విమర్శలు

ఇకపోతే ఇప్పుడు అనధికారిక కట్టడాలు భారీ ఎత్తున జరుగుతున్నా అధికారులు నిద్రమత్తు వదలడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిపిఎస్, ఎల్ఆర్ఎస్ రెగ్యులర్ కాసుల వంట కురిపించేలా అధికారులు పనులు చక్కబెడుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిన్నర కాలంగా నిద్ర పోయారా ..! ఇప్పుడే మేల్కొన్నారా…? అదే విమర్శలు నగర ప్రజల నుంచి భారీగా వినిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

అమెరికాపై ఒత్తిడి..రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు అనుమతి

అమెరికాపై ఒత్తిడి..రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు అనుమతి

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

ఆదాయాలు తగ్గినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాము

ఆదాయాలు తగ్గినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాము

కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు కన్నుమూత

కోస్తాంధ్రలో నేడు, రేపు వర్షాలు

కోస్తాంధ్రలో నేడు, రేపు వర్షాలు

ఏపీ నెంబర్ వన్ పర్యాటక రంగంగా అభివృద్ధి

ఏపీ నెంబర్ వన్ పర్యాటక రంగంగా అభివృద్ధి

హర్మూజ్‌ జలసంధి సమీపంలో యూఎస్ దాడులు

హర్మూజ్‌ జలసంధి సమీపంలో యూఎస్ దాడులు

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
0:51

కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

పాల కల్తీని గుర్తించాలంటే..

పాల కల్తీని గుర్తించాలంటే..

📢 For Advertisement Booking: 98481 12870