हिन्दी | Epaper

Sanju Samson: టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

Saritha
Sanju Samson: టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

Sanju Samson: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా టైటిల్ విజేతగా నిలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్‌లో నిలకడగా రాణిస్తూ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచారు. తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన “ప్లేయర్ ఆఫ్ ద సిరీస్” అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో శాంసన్ పేరు మారుమోగుతోంది. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసి “ప్లేయర్ ఆఫ్ ద సిరీస్” అవార్డు అందుకున్న అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిచాలని మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ సూచించాడు. 

Read Also: BCCI Awards 2026: భారత జట్లను సన్మానించనున్న బీసీసీఐ

Sanju Samson: టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?
Sanju Samson: Sanju Samson as Team India captain?

బీసీసీఐ నిర్ణయంపై ఉత్కంఠ

జట్టులోని ప్రతి ఆటగాడిని ప్రోత్సహించే గొప్ప నాయకత్వ లక్షణాలు సంజూలో ఉన్నాయని ఆయన కొనియాడారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును నడిపించిన అనుభవం కూడా అతడికి కలిసి వస్తుందని కైఫ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ‘శాంసన్ ఫర్ కెప్టెన్’ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై కూడా చర్చ కొనసాగుతోంది. అయితే, కెప్టెన్సీ మార్పు అనేది చిన్న విషయం కాదు కాబట్టి, దీనిపై బీసీసీఐ (BCCI) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870