हिन्दी | Epaper

AP Adulterated Milk: ‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

Rajitha
AP Adulterated Milk: ‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బ్యూరో : రాజమహేంద్రవరంలో చౌడేశ్వరి నగర్లో కల్తీ పాలు. సేవించి పలువురు మృతి చెందిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీప్ షర్మిల రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కిమ్స్ ఆసుపత్రిలో కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన షర్మిల రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కల్తీ పాల ఘటనలో నిరక్ష వరలక్షి శ్రీ సంస్థతో పాటు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని అన్నారు. 11 మంది మృతిపై ఇది ప్రభుత్వం చేసిన హత్యలేనని, దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబు వహించాలని డిమాండ్ చేశారు. లైసెన్స్ లేకుండా 11 ఏళ్లుగా పాలు అమ్ముతుంటే తనిఖీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మొద్దు నిద్ర పోతున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Read also: Telangana: శాసన మండలి నూతన భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

AP Adulterated Milk

AP Adulterated Milk

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, సైతాన్ సైన్యాన్ని పరామర్శించడం తప్ప ప్రజా సమస్యల కోసం బయటకు రారు అని ఏద్దావా చేసారు. రాష్ట్రంలో పాలు కల్తీ, నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, వాగ్దానాలు కల్తీ మొత్తం పాలనే కల్తీ అని దుయ్యబట్టారు. ఇథలీన్ గ్లైకాల్ కలిసి 11 మంది కలిసి చనిపోవడం బాధాకరం 9 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు ఆరోగ్యంగా ఉండాల్సిన వారు వెంటిలేటర్ మీదున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు.. ప్రభుత్వ నిర్లక్ష్యం అని అన్నారు. ఫుడ్ సేఫ్టీ శాఖ మొద్దు నిద్ర పోయింది కల్తీపై చర్యలు లేవు, తనిఖీలు లేవు రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారి ఒకరే, అమె కూడా ఇక్కడ వుండరు. చంద్రబాబు ఏఐ గురించి చెప్తున్నారు ప్రజల ఆరోగ్యానికి ఇక్కడ దిక్కులేదు. ఇప్పుడు పాపులేషన్ పెంచండి అంటున్నారు ముగ్గురు లేదా నలుగురు సంతానానికి ప్రోత్సాహకాలు అంటున్నారు పాలల్లో యూరియా, డిటర్జెంట్లు కలుపుతున్నారు.

రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ మొద్దు నిద్రపోయింది

పాల విషయంలో భద్రత ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత, రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ మొద్దు నిద్రపోయింది ఈ ఘటనతో నాలుగు రోజులు తనిఖీలు అంటూ హడావిడి చేశారు మళ్లీ యథా రాజా తథా ప్రజా అన్నట్లు వుంది అని ఆరోపించారు. నిఘా పెట్టడం ప్రభుత్వం భాద్యత నిరంతరం తనిఖీలు చేస్తూ ఉంటే ఈ ఘటన జరిగేది కాదని అన్నారు. ఫుడ్ సేఫ్టీ సంస్థను బలోపేతం చేయాల ని, ఆ సంస్థలో కొత్త నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ ప్రభుత్వానికి స్కామ్స్, మాఫియాల మీద ఉన్న శ్రద్ధలో పావు వంతు ఆరోగ్యం, సంక్షేమాల, సామాన్యుల జీవితాల మీద దృష్టి పెట్టాలని సూచించారు. మృతుల కుటుంబా లకు పరిహారం 10 లక్షలు చాలవని, 25 లక్షలు ఇవ్వాలి అని షర్మిల డిమాండ్ చేసారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870