हिन्दी | Epaper

Seethakka: రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

Saritha
Seethakka: రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష

Seethakka: రాష్ట్రంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల పాత్రను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీ డాభివృద్ధి శాఖపై సోమవారం మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, అన్ని విభాగాల హెచ్ఒడిలు పాల్గొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ వినియోగం, వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. విభాగాల వారీగా అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించగా వాటిలో పలు మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే లోపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒక్క రూపాయి కూడా. పెండింగ్ పడకుండా, వెనక్కి పోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

Read Also: Mahabubabad: ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే జైలు శిక్షే..వైరల్ అవుతున్న ఫంక్షన్ హాల్ బోర్డు

Seethakka: రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి
Seethakka: The state should achieve the central funds it is entitled to.

15వ ఆర్ధిక సంఘం నిధుల సాధన

గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా గ్రామాలకు కేంద్ర నిధులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని, ఈనేపథ్యంలో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటాను సాధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రానికి రాష్ట్రం భారీగా పన్నులు చెల్లిస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా సాధించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తే అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్ధిక సంఘం నిధులు పెండింగ్లో ఉన్నాయని, అవసరమైన యుటిలిటీ సర్టిఫికెట్లు సమర్పించి వాటిని త్వరగా విడుదల చేయించు కోవాలన్నారు.

ఉపాధి హామీ, అభివృద్ధి లక్ష్యాలు

ఉపాధి హమీ పథకం స్థానంలో కేంద్రం ప్రవేశ పెట్టిన విబిజిరాంజి చట్టానికి సంబంధించి ఇంకా నిబంధనలు సిద్ధం కాలేదని పేర్కొన్న మంత్రి సీతక్క, గ్రామీణ ప్రాం తాల్లో ఉపాధీ కల్పన కోసం బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శాఖలోని అన్ని విభాగాలు తమ ప్రగతి నివేదికలను క్రమం తప్పకుండా రూపొందించాలని ఆదేశించారు. జల సంరక్షణ కార్యక్ర మాల్లో రాష్ట్రానికి ఉత్తమ రాష్ట్రంగా అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ అదే విధంగా అన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరచాలని సూచించారు.

99 రోజుల ప్రణాళికల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నంబర్ వన్ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. జిల్లాల వారీగా నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాలను త్వరితగతిన పూర్తి వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి ఈ భవ నాలను ప్రారం భించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆనంతరం వాటర్ షెడ్ డెవలప్మెంట్ కార్యక్రమంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆదివాసి, ఏజన్సి, గిరిజన ప్రాంతాల్లో అనేక వాగులు ఉన్నప్పటికీ వేసవికాలంలో సాగు, తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

📢 For Advertisement Booking: 98481 12870