AP teachers news : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు శుభవార్తలు ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు అంధ ఉపాధ్యాయులకు హాజరు నిబంధనల్లో మినహాయింపు కల్పించింది.
నిరసన కేసుల ఉపసంహరణ
సీపీఎస్ రద్దు కోరుతూ 2022లో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలో 73 మంది ఉపాధ్యాయులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.
Read Also: Lokesh : నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

కోర్టులో పిటిషన్ దాఖలు
కేసుల ఉపసంహరణకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి హోంశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో రెండేళ్లుగా కేసులతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు పెద్ద ఊరట లభించింది.
అంధ ఉపాధ్యాయులకు హాజరు మినహాయింపు
ఇదే సమయంలో అంధ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. పాఠశాలల్లో అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం నుంచి వారికి మినహాయింపు ఇచ్చింది.
ఇకపై సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దృష్టిలోపం గల ఉపాధ్యాయుల హాజరును LEAP యాప్‌లో నేరుగా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :