Telangana movement case : తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన ఒక కీలక కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సకలజనుల సమ్మె సమయంలో నమోదైన కేసును కోర్టు కొట్టివేస్తూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట కలిగించింది.
సకలజనుల సమ్మె కేసు
2011లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో ‘సకలజనుల సమ్మె’ పిలుపు ఇచ్చారు. ఆ సమయంలో బంజారాహిల్స్ పోలీసులు కేసీఆర్, కేటీఆర్‌తో పాటు పలువురు ఉద్యమ నాయకులపై కేసు నమోదు చేశారు.
Read Also: డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు

కోర్టు తీర్పు
ఈ కేసు పుర్వాపరాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు చివరకు కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కేసీఆర్, కేటీఆర్‌తో పాటు ఇతర నేతలకు కూడా ఊరట లభించింది.
న్యాయవాదుల వ్యాఖ్యలు
ఈ కేసులో వాదనలు వినిపించిన బీఆర్‌ఎస్ లీగల్ సెల్ సభ్యుడు జక్కుల లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అనేక కేసులను తాను వాదించానని చెప్పారు. ఉద్యమ న్యాయవాదిగా కేసీఆర్ సకలజనుల సమ్మె కేసులో వాదించడం తనకు గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: