हिन्दी | Epaper

Nagar kurnool: అంతుచిక్కని వైరస్‌.. వేల సంఖ్యలో కోళ్ల మృతి!

Pooja
Nagar kurnool: అంతుచిక్కని వైరస్‌.. వేల సంఖ్యలో కోళ్ల మృతి!

Nagar kurnool: తెలంగాణలోని పౌల్ట్రీ రంగం ఇప్పుడు ఒక అంతుచిక్కని వైరస్ ధాటికి వణికిపోతోంది. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో బాయిలర్ కోళ్లు వేల సంఖ్యలో మృత్యువాత పడుతుండటం కలకలం రేపుతోంది. గత మూడు రోజులుగా కుప్పలుకుప్పలుగా కోళ్లు చనిపోతుండటంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేవలం కొన్ని ఫామ్‌లలోనే వేల సంఖ్యలో మరణాలు సంభవించాయంటే, రాష్ట్రవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం ఎంత మేర ఉందోనని అధికారులు లెక్కలు తీస్తున్నారు.

Read Also:Human Metapneumovirus: అమెరికాను వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్

Nagar kurnool
Nagar Kurnool: An elusive virus.. thousands of chickens die!

జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లిలో ఉన్న రెండు ప్రధాన పౌల్ట్రీ ఫామ్‌లలో ఈ మరణాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఒక్క చిన్నపురావుపల్లిలోనే దాదాపు 5 వేల కోళ్లు చనిపోగా, నాగర్‌కర్నూల్ మండలం రాంరెడ్డిపల్లి తండాలో మరో 1,500 కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 10 వేల కోళ్లు మృతి చెందినట్లు ప్రాథమిక అంచనా. అయితే, ఈ మరణాలకు గల అసలు కారణం ఏమిటో తెలియకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

రంగంలోకి ఫోరెన్సిక్ నిపుణులు

ఈ వింత వ్యాధిపై పౌల్ట్రీ రైతులు స్పందిస్తూ.. గడిచిన కొద్ది రోజుల్లోనే లక్షలాది కోళ్లు రాష్ట్రవ్యాప్తంగా చనిపోయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. వైరస్ రకాన్ని గుర్తించేందుకు కోళ్ల నమూనాలను (Samples) సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా ఈ పరిశోధనలో భాగస్వామ్యం కానుంది. భారీగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870