हिन्दी | Epaper

Karimnagar Crime: బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

Pooja
Karimnagar Crime: బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

Karimnagar Crime: కరీంనగర్ జిల్లాలో ఒక చిన్న కోరిక తీరలేదన్న మనస్తాపంతో నిండు ప్రాణం బలికావడం తీవ్ర విషాదాన్ని నింపింది. కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన రిత్విక్ (17) అనే బాలుడు, తనకు బైక్ కొనివ్వాలని తండ్రిని కోరాడు. అయితే, ప్రస్తుతానికి చేతిలో డబ్బులు లేవని, సాగు చేసిన పంట అమ్మి డబ్బులు వచ్చిన వెంటనే బైక్ కొనిస్తానని తండ్రి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Read Also: Tirupati Elephant Death: వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

చికిత్స పొందుతూ రిత్విక్ మృతి

Karimnagar Crime
Karimnagar Crime: Boy commits suicide after not being allowed to buy a bike

కానీ, తండ్రి మాటలతో సంతృప్తి చెందని రిత్విక్, వెంటనే బైక్ దక్కలేదన్న ఆవేదనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ మెరుగైన వైద్యం అందించినప్పటికీ, విషప్రభావం శరీరమంతా పాకడంతో పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ రిత్విక్ ఆదివారం మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. చేతికి అందిన కొడుకు చిన్న విషయానికే బలవన్మరణానికి పాల్పడటంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. గ్రామంలో ఈ ఘటన అందరినీ కలచివేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870