हिन्दी | Epaper

Suryakumar Yadav: రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

Pooja
Suryakumar Yadav: రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ విజయం అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY) తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు స్వస్తి పలికారు. గత కొన్ని రోజులుగా సూర్య అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరుగా సాగాయి. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానమిస్తూ, ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచనే లేదని స్పష్టం చేశారు.

Read Also:T20 WC Final: 82.1 కోట్ల లైవ్ వ్యూస్‌తో సరికొత్త చరిత్ర!

Suryakumar Yadav
Suryakumar Yadav: What does Surya have to say about retirement?

సూర్య రిటైర్మెంట్ పుకార్లకు చెక్

“నేను ఇప్పుడే ఎక్కడికీ వెళ్లడం లేదు.. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచన ఎందుకు?” అని సూర్య ఎదురు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన కనీసం మరో రెండేళ్ల పాటు టీమిండియాకు అందుబాటులో ఉంటారని ఖాయమైంది. ఫైనల్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న సూర్య, తన తదుపరి లక్ష్యాలను కూడా ఇప్పుడే ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు.

భవిష్యత్ ప్రణాళికల గురించి వివరిస్తూ.. 2028లో జరగబోయే రెండు మెగా ఈవెంట్లపై తన దృష్టి ఉందని సూర్య వెల్లడించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ అరంగేట్రం చేయనుండటంతో, అక్కడ భారత్‌కు స్వర్ణం అందించడమే తన ప్రధాన ఆశయమని చెప్పారు. అలాగే అదే ఏడాది జరిగే తదుపరి టీ20 ప్రపంచకప్‌ను కూడా కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్లారిటీతో సూర్య రిటైర్మెంట్ పుకార్లకు పూర్తిగా తెరపడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్‌ దాడులు.. అమెరికా సీరియస్!

ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్‌ దాడులు.. అమెరికా సీరియస్!

యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ
2:12

‘హలో బచ్చో’ వెబ్ సిరీస్ రివ్యూ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870