టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి, టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఓపెనర్లు సంజూ శామ్సన్, అభిషేక్ శర్మ ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం బాది టోర్నీలోనే వేగవంతమైన హాఫ్ సెంచరీని తన పేరిట రాసుకున్నాడు. మరోవైపు సంజూ శామ్సన్ 89 పరుగులతో (46 బంతుల్లో) క్లాస్ ఇన్నింగ్స్ ఆడి, ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. వీరిద్దరూ కలిసి పవర్‌ప్లేలోనే 92 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు.
Read Also : Kamareddy crime : కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి
శాంసన్, అభిషేక్ జోరును ఇషాన్ కిషన్ కూడా కొనసాగించాడు. కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మధ్యలో సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డకౌట్ అవ్వడం, హార్దిక్ పాండ్యా త్వరగా పెవిలియన్ చేరడంతో స్కోరు వేగం కాస్త తగ్గినట్లు అనిపించినా.. ఆఖర్లో శివమ్ దూబే (8 బంతుల్లో 26) తన ప్రతాపం చూపించాడు. చివరి ఓవర్‌లో వరుస ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో భారత్ 250 మార్కును దాటగలిగింది. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న న్యూజిలాండ్, భారత బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ప్రస్తుతానికి మ్యాచ్ భారత్ వైపే మొగ్గు చూపుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :