हिन्दी | Epaper

Women’s Day 2026: మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

Anusha
Women’s Day 2026: మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

Women’s Day 2026: ప్రజాభవన్‌లో ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే వేడుకలను ప్రభుత్వం ఇవాళ ఘనంగా నిర్వహించింది. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళల్ని ప్రభుత్వం సత్కరించింది. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ స్వయంగా పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ మహిళలు తయారుచేసే వస్తువులకు అమెజాన్‌లో అమ్మకానికి అవకాశం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మహిళ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం కల్పించే అవకాశాలు అందిపుచ్చుకుని మహిళలు ఉన్నత స్థాయికి చేరాలి.

Read Also: Swachh Hyderabad: క్లీన్ సిటీగా హైదరాబాద్‌: రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

మహిళలు ఉన్నత స్థాయికి చేరాలి: CM రేవంత్

త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీలు

తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఉంది. దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా, స్పీకర్‌గా మహిళలకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ’ అని అన్నారు. త్వరలోనే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాం. మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. వారి కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. డ్వాక్రా సంఘాల ద్వారా రుణం అందిస్తున్నాం. గృహలక్షి పథకం ద్వారా సబ్సిడీకి గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. మహిళలు ఆర్ధికంగా ఎదిగేలా ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తున్నాం ” అంటూ రేవంత్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870