हिन्दी | Epaper

Mylavaram Wedding Drama: మైలవరం పెళ్లిలో హైడ్రామా

Aanusha
Mylavaram Wedding Drama: మైలవరం పెళ్లిలో హైడ్రామా

Mylavaram Wedding Drama: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగుచూసింది. వేర్వేరు గ్రామాలకు చెందిన యువతీ యువకులకు పెద్దలు వివాహం నిశ్చయించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, బంధుమిత్రుల కోలాహలం మధ్య శుక్రవారం వరుడి నివాసంలో వేడుకగా పెళ్లి జరుగుతోంది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి సీన్ రివర్స్ అయ్యింది.

Read Also: AP crime: రాజమండ్రి కోర్టులో అనంతబాబు భార్యకు చుక్కెదురు

High drama in Mylavaram wedding
High drama in Mylavaram wedding

‘వచ్చావా’ అంటూ మండపం దిగిన వధువు

ముహూర్తం సమయంలో వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. అదే సమయంలో ఓ యువకుడు హఠాత్తుగా మండపం వద్దకు వచ్చాడు. అతడిని చూసిన వెంటనే వధువు పీటల మీద నుంచి లేచి “వచ్చావా” అంటూ అతడి వద్దకు వెళ్లింది. “ఇతను మా ఊరివాడే, మేమిద్దరం ప్రేమించుకున్నాం” అని అందరి ముందు ప్రకటించడంతో వరుడితో పాటు బంధువులంతా నిశ్చేష్టులయ్యారు.

ఈ పరిణామంతో ఆగ్రహానికి గురైన వరుడి తరఫు వారు ప్రియుడిపై చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. తమ కొడుకు పెళ్లి కోసం రూ.20 లక్షల వరకు ఖర్చు చేశామని, తీరా చివరి నిమిషంలో ఇలా పరువు తీశారని వరుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.చివరకు పెళ్లి ఆగిపోవడంతో శనివారం గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాలు పంచాయితీ నిర్వహించుకుని వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. ప్రేమించిన వాడి కోసం వధువు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన ఈ ఘటన నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

దుబాయ్ ఎయిర్‌పోర్టులో క్షిపణి హెచ్చరికలు

దుబాయ్ ఎయిర్‌పోర్టులో క్షిపణి హెచ్చరికలు

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

ప్రపంచ కప్ విజేతలకు రూ.131 కోట్ల నగదు

ప్రపంచ కప్ విజేతలకు రూ.131 కోట్ల నగదు

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

📢 For Advertisement Booking: 98481 12870