Vijay Sangeetha Divorce: టీవీకే అధినేత విజయ్ భార్య సంగీత, తమ విడాకుల కేసు ముగిసే వరకు చెన్నై నీలంకరైలోని ఇంట్లోనే ఉండేందుకు అనుమతివ్వాలని కోరుతూ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, తాము కలిసి ఉన్న ఇంట్లోనే ఉండేందుకు అనుమతించాలని ఆమె కోరడం చర్చనీయాంశమైంది.
Read Also: Gaddar Film Awards 2025: మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!
ఆ ఇంట్లో నాకు సగం వాటా ఉంది!
సంగీత తన పిటిషన్‌లో కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. “నీలంకరైలోని ఇంట్లో తనకు సగం వాటా ఉందని, విడాకుల కేసు ముగిసే వరకు, తాను వేరే ఇంటికి మారే వరకు అక్కడ ఉండేందుకు అనుమతించాలని ఆమె తన పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్‌తో ఆమె మరోసారి అందరినీ షాక్‌కు గురిచేశారు.

విజయ్ నుంచి విడాకులు కోరుతూ కొద్దిరోజుల క్రితం సంగీత కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో గత నెల 24న ఆమె పిటిషన్ వేసింది. 2021లో ఓ నటితో విజయ్ కు వివాహేతర సంబంధం ఏర్పడటం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఏప్రిల్ 20న వారి విడాకుల పిటిషన్ విచారణకు రానుంది. ఆ రోజు కోర్టుకు విజయ్ హాజరుకావాలని న్యాయస్థానం ఇప్పటికే నోటీసు ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: