हिन्दी | Epaper

Central Govt: గృహ అవసరాలకే ప్రాధాన్యత.. కేంద్రం

Saritha
Central Govt: గృహ అవసరాలకే ప్రాధాన్యత..  కేంద్రం

పెట్రోల్, డీజెల్ కు డోకా లేదు: కేంద్రం

Central Govt: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆయిల్, గ్యాస్ సరఫరాపై పడింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితుల్లో కేంద్రం అప్రమత్తమైంది. పెట్రోల్, డీజెల్ సరఫరాలో రేషనింగ్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. నిల్వలు పూర్తిగా ఉండటంతో ఆందోళన అవసరం లేదని చెబుతోంది. అదే సమయంలో ఆయిల్ కంపెనీలకు తాజాగా కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎల్పీజీ సరఫరాలో అంతరాయం లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ సరఫరాలో గృహ వినియోగ దారులకే ప్రాధాన్యం ఇవ్వాలని చమురు మార్కెటింగ్ సంస్థలను ఆదేశించింది.

పరిశ్రమలు, పెట్రోకెమికల్ రంగాలకు ఎల్పీజీ సరఫరాలో తాత్కాలిక పరిమితులు విధించాలని సూచించింది. ప్రస్తుతం ఎల్పీజీ దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఖతార్ నుంచి భారత్ ప్రధానంగా ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇరాన్ దాడులు చేస్తుండటంతో ఖతార్ ఎల్పీజీ సరఫరాను నిలిపివేసింది. అటు భారత్కు గ్యాస్ విక్రయిస్తామంటూ ఆస్ట్రేలియా, కెనడా దేశాలు ముందుకొచ్చాయి.

Read Also: Postal Jobs: తపాలా శాఖ GDS ఫలితాలు విడుదల

Central Govt: గృహ అవసరాలకే ప్రాధాన్యత..  కేంద్రం
Central Govt: Center imposes restrictions on gas supply, giving priority to household needs

గ్యాస్ బుకింగ్స్ పై అనధికారిక పరిమితులు

యుద్ధం వేళ వంట గ్యాస్ కొరత తప్పదనే ప్రచారం వేళ వినియోగదారులు పెద్ద సంఖ్యలో బుకింగ్స్ చేసుకుంటున్నారు. దీం తో సరఫరా పైన ఒత్తిడి పెరుగుతోంది. ఆయిల్ కంపెనీలు తమ ఏజెన్సీ ల ద్వారా అనధికారికం గా వంట గ్యాస్ బుకింగ్స్ పై పరిమితులు అమలు చేస్తున్నారు. గ్యాస్ బుకింగ్పై పరిమితులు రెండు సిలిండర్లు ఉన్న గ్యాస్ వినియోగదారుడికి బుకింగ్ గడువు 30 రోజులు. ఒక సిలిండర్ ఉన్న వినియోగదారుడికి 21 రోజుల తరువాతనే బుకింగ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయిల్ కంపెనీ లు బుకింగ్ పోర్టల్స్. యాప్ల సాఫ్ట్వేర్లోనూ మార్పులు చేసారు. దీని ద్వారా సిలిండర్ పొందిన 21 రోజుల తరువాత మాత్రమే మరో సిలిండర్ కోసం బుకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ప్రభు త్వం, ఆయిల్ కంపెనీలు మాత్రం వంటగ్యాస్ సరఫరాలో ఎలాంటి సమస్య లేదని చెబుతున్నాయి. ఇప్పుడు యుద్ధం కొనసాగుతున్న వేళ. సెప్టెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870