हिन्दी | Epaper

Jio Finance App: ‘జియో ఫైనాన్స్’ యాప్ లాంచ్

Aanusha
Jio Finance App: ‘జియో ఫైనాన్స్’ యాప్ లాంచ్

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ప్రపంచమే అరచేతిలో ఉన్నట్లు. సామాన్యుడి ఆర్థిక అవసరాలను మరింత సులభతరం చేసే దిశగా రిలయన్స్ గ్రూప్ మరో భారీ అడుగు వేసింది. “భారత్ కోసం నిర్మించిన ఇంటెలిజెంట్ ఫైనాన్స్” అనే నినాదంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFSL) తన సరికొత్త ‘జియో ఫైనాన్స్’ యాప్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదని, ప్రతి భారతీయుడికి ఒక వ్యక్తిగత ఆర్థిక సలహాదారు అని సంస్థ పేర్కొంది.

Read Also: Amazon : అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్ మాములుగా లేవు !!

ఏఐ,మెషిన్ లెర్నింగ్‌తో ఆధునిక రూపం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, తన పాత వెర్షన్ యాప్‌ను పూర్తిగా ఆధునికీకరించింది. ఇందులో లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ సామర్థ్యాలను జోడించింది. దీనివల్ల వినియోగదారులకు మరింత వేగవంతమైన, సురక్షితమైన మరియు స్మార్ట్ ఫైనాన్షియల్ సేవలు అందుతాయి. కోట్లాది మంది భారతీయులకు ఆర్థిక చేరువను పెంచడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశ్యం.

Jio Finance App launch
Jio Finance App launch

ఈ యాప్ సాధారణ ఫైనాన్స్ యాప్స్ కంటే భిన్నాంగా ఉంటుంది. ఇందులో ఉండే ఏఐ టెక్నాలజీ వినియోగదారుల ఆర్థిక అలవాట్లను విశ్లేషించి వారికి తనిగి సలహాలు ఇస్తుంది. ఒక వ్యక్తిగత ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా, యూజర్లు తమ ఖర్చులు, పొదుపు, పెట్టుబడులను ఎలా మెరుగుపరుచుకోవాలో సూచిస్తుంది.

ఫిజికల్ డెబిట్ కార్డు పొందే సదుపాయం

జియో పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా, కేవలం బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారానే 5 నిమిషాల్లోనే జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను ప్రారంభిచవచ్చు. దీంతో పాటు ఫిజికల్ డెబిట్ కార్డు పొందే సదుపాయం ఉంది. మ్యూచువల్ ఫండ్లపై రుణాలు, ఆస్తిపై రుణాలు, గృహ రుణాలు, సెక్యూరిటీలపై లోన్స్ ఈ యాప్ ద్వారా ఈజీగా పొందవచ్చు.

అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఇది ఒక అద్భుతమైన వేదికగా కంపెనీ తెలిపింది. జియో బ్లాక్ రాక్ భాగస్వామ్యంతో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం, అలాగే ఆరోగ్య, జీవిత బీమా, వాహన బీమాలకు అతి తక్కువ సమయంలోనే పోల్చి చూసి కొనుగోలు చేసే వెసులుబాటు ఈ యాప్ కల్పిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

సీఏ ఫలితాల విడుదల

సీఏ ఫలితాల విడుదల

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

📢 For Advertisement Booking: 98481 12870