हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Pollution : కాలుష్య కాసారంలో నగరాలు!

Sudha
Pollution : కాలుష్య కాసారంలో నగరాలు!

కాలకూట విషంగా మారుతున్న నీటి, వాయు కాలుష్యాల నుండి ప్రజలను కాపాడేందుకు పాలకులు చట్టాలపై చట్టాలు చేస్తున్నారు. ఎంద రిపైనో చర్యలు తీసుకుంటున్నామనిచెప్పుకుంటున్నా ఆశించిన ఫలితాలు చేకూరడం లేదు. కాలుష్య కాటుకు బలయ్యేవారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. ఈ సమస్యను పరిష్కరించ డంలో ప్రభుత్వాలు ఇంకా జాప్యం చేస్తే కాలుష్యకాటుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది బలికాక తప్పదని పర్యావ రణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. జీవించే హక్కు కల్పిం చాల్సిందిగా కోరుతూ ఎందరో ఈ కాలుష్య కాసారంలో చిక్కుకున్న నిర్భాగ్యుల వేదన అరణ్యరోదనగానే మిగిలి పోతున్నది. కాలుష్య నియంత్రణకు ఏనాడో మండలని ఏర్పాటు చేశారు. అనేక చట్టాలు తెచ్చారు. చర్యలు తీసు కుంటున్నారు. అయినా అవేమీ ఈకాలుష్యం (Pollution)నుండి ప్రజ లను కాపాడలేకపోతున్నాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా నగరాల్లో కాలుష్యం అంతకంతకు పెరిగి నగర పరిసర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నది. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం సగం నగరాల్లోనే నివసిస్తున్నది. మరో మూడు దశాబ్దాల నాటికి నగరాల జనాభా అదనంగా మూడువం దల కోట్లకుపైగా పెరుగుతుందని అధికారులు అంచనా. భూభాగంపై నగరాల వైశాల్యం రెండు శాతానికి మించక పోయినా కాలుష్యం(Pollution)లో మాత్రం అది ప్రపంచ జనాభా ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపే స్థాయిలో విస్తరిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా స్థూల దేశీయోత్పత్తిలో అరవైశాతం ఆరువందల పట్టణాల్లో కేంద్రీకృతమై ఉందంటే నగరాల ప్రాధాన్యత ఎంతగా ఉందో చెప్పనవసరం లేదు. వ్యవ సాయ రంగంలో ఏర్పడిన సంక్షోభం, గ్రామీణ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుండడంతో వలసలు పెరిగిపోయాయి. అందుకే గ్రామీణ జనాభా తగ్గుతుండగా పట్టణాల్లో జనాభా యేడాది యేడాదికి ఊహకందని రీతిలో పెరిగిపోతున్నది.

Read Also : War Effect: శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

 
Pollution

Pollution

ప్రధానంగా భారతదేశంలో పట్టణీకరణ అందుకోలేనంతగా విస్తరిస్తున్నది. 2001లో పట్టణ ప్రాంతాల్లో జనాభా ఇరవై ఎనిమిదిన్నర కోట్లు ఉండగా ఇప్పుడది నలభైకోట్లకుపైగా చేరుకున్నది. 2005లో ప్రారంభించిన జవహర్లాల్నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ కార్యక్ర మం (జెఎన్ఎన్ఎయుఆర్ఎమ్) కింద పట్టణ ప్రాంతాలకు మరికొన్ని సౌకర్యాలు కల్పించి మెరుగైన జీవనం కల్పిం చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెరుగుతున్న అవసరాలు, జనాభాను అవి అందుకోలేక పోతున్నాయి. భారత్లోని ఆరు మెట్రోనగరాలు హైదరాబాద్, ఢిల్లీ, బెంగ ళూరు, కోల్కత్తా, ముంబాయి, చెన్నైలలో ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. పర్యావరణం, గాలినాణ్యత, నీటి నాణ్యత, అటవీ విస్తీర్ణం, పచ్చదనం, వాతావరణ మార్పులు, చెత్త నిర్వహణ, తదితర అంశాల ప్రాతిపదికగా ఆ సర్వే నిర్వహించారు. విస్తరణ, తదితర అంశాల్లో కొన్ని నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా చేపట్టడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావం చూపుతున్నట్లు వెలుగు చూసింది. ముఖ్యం గా నగరాల్లో వాయుకాలుష్యం వల్ల పౌరుల ఊపిరితిత్తు లకు తూట్లు పడుతున్నాయని హెచ్చరించింది. చెన్నై, కోల్కతా, ముంబాయిలలో వాహన కాలుష్యం తీవ్రంగా ఉంది. తర్వాత స్థానంలో పారిశ్రామిక కాలుష్యం బెంగ ళూరులో పరిస్థితి మరొకరకంగా ఉంది. పరిశ్రమల కార ణంగా అక్కడ వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరినట్లు ఆ సర్వే చెప్తున్నది. ఇక వాహనాలు, నీటికాలుష్యంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. నిర్మాణరంగం వల్ల పీల్చే గాలిలో అధికశాతం దుమ్ముధూళి చేరుతుండడంతో ప్రజా రోగ్యం రానురాను ప్రశ్నార్థకంగా మారింది.

 
Pollution

Pollution

హైదరాబాద్మహానగరంలో వాయుకాలుష్యానికి నీటి కాలుష్యంకూడా తోడుకావడంతో పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతు న్నది. ముఖ్యంగా విషపూరితమైన రసాయనిక కలుషిత జలాలను శుద్ధి చేయకుండా మూసీలో కలుపుతున్న పరి శ్రమలపై చర్యలు అంతంత మాత్రంగా ఉండడంతోమూసీ పరివాహక ప్రాంతం కాలుష్యకాసారంలో కొట్టుకమిట్టాడుతున్నది. వాస్తవానికి ఈ సమస్య కొత్తగా పుట్టుకువచ్చింది కాదు. ప్రభుత్వ విధానాలు, కొందరు అధికారుల అవినీతి, అసమర్థత, అంతులేని నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య రోజురోజుకు అంతకంతకు పెరిగిపోతున్నది. గత పాల కుల నిర్వహకంతో మూసీతోపాటు దానిపరివాహక ప్రాం తాల్లో కుంటలు, చెరువులెన్నో కాలుష్యకాసారాలుగా మారిపోయాయి. ఒక్క హైదరాబాద్ కాదు అటు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు తదితర ఆంధ్రప్రదేశ్లోని అనేక పట్టణాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ముఖ్యంగా నీటి, వాయు కాలుష్యాలతో మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్నది. దేశంలో వాతావరణంలో ధూళికణాలు ఉండాల్సిన స్థాయి కన్నా ఐదురెట్లు అధికం గా ఉండటంతో శ్వాససమస్య నుంచి కేన్సర్ దాకా అనేక రోగాల బారినపడుతున్నారని వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వాయుకాలుష్యం కాదు దేశ సుసంపన్న మైన చరిత్ర సంస్కృతులకు ప్రతీకలుగా భాసిల్లు తున్న వారసత్వ కట్టడాలకు కూడా ముప్పు ముంచు కొస్తు న్నదని పర్యావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరి స్తున్నారు. ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించిన పరిశీల నలో ముప్ఫైతొమ్మిది నగరాల్లో 138 వారసత్వ కట్టడాల పరిస్థితి వాయుకాలుష్యం వల్ల ఆందోళనకరంగా ఉన్నట్లు వెల్లడయింది. ఇప్పటికైనా పాలకులు కాలుష్య నివారణకు చట్టాలు, నిబంధనలు విధించి చేతులు దులుపుకోకుండా నియంత్రణకు నిర్దిష్టమైన ప్రణాళికతో పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

📢 For Advertisement Booking: 98481 12870