TG Monkeys Menace: పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రధాన ఎజెండాగా మారిన కోతుల సమస్య ఇప్పుడు కొత్త సర్పంచులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గెలిపిస్తే కోతులను తరిమేస్తామని హామీ ఇచ్చిన సర్పంచులు ఇప్పుడు కోతుల బెడద నుండి ఊళ్ళకు విముక్తి కల్పించడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మంకీ క్యాచర్స్తో కోతులను పట్టించి సమీప అడవుల్లో వదిలేస్తున్నారు. ఆ కోతులు పొరుగు గ్రామాలపై పడడంతో కొత్త పంచాయతీ మొదలవుతుంది. వానరాలు ఊళ్లలో వంటలను చిన్నాభిన్నం చేస్తున్న కోతులు ఊళ్లలో జనానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. వానర సేనల మూకుమ్మడి దాడులతో ఊళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. జనం అంతా బేజారైపోతున్నారు. కోతులను తరిమెందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు పడరాని పాట్లు పడుతున్నారు. వాటిని పట్టి అడవుల్లోకి సాగనంపుతున్నారు.
Read Also: Gandhi Hospital: రోగ నిర్ధారణ పరీక్షలు గగనమే..
కోతుల బెడదతో సర్పంచుల పాట్లు.

గెలిపిస్తే కోతుల లేకుండా చేస్తామని గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన సర్పంచులు ఇప్పుడు కోతులను తరిమే పనిలో పడ్డారు. ఆయా గ్రామాల్లో పట్టిన కోతులను సమీప అడవుల్లో వదిలేస్తున్నారు. ఆ కోతులు పక్కనే ఉన్న ఊర్లపై పడడంతో అక్కడ కొత్త సమస్య మొదలవుతుంది. కోతుల మధ్య బీకర యుద్ధం కొనసాగుతుంటే వాటిని ఎలా సాగనంపాలో తెలియక సర్పంచులు, గ్రామస్తులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా హనుమకొండ లోని భీమదేవరపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో కోతుల బెడద విపరీతంగా మారింది. మండలంలోని వివిధ గ్రామాల్లో పట్టిన కోతులను భీమదేవరపల్లి పక్కనే ఉన్న బూడిదగుట్టపై వదిలేస్తున్నారు. కోతులన్నీ ఇప్పుడు భీమదేవర పల్లి గ్రామాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తానికి కోతుల వల్ల పంట నష్టంతో గ్రామస్తులకు మానసిక ప్రశాంతత కరువైందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: