Hyderabad: గ్లోబల్ సిటీగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌కు వేదిక కానుంది. 2026లో జరగనున్న ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ (FIH) విమెన్ హాకీ వరల్డ్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుందని తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.
Read Also: Kavitha new party : కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ సంకేతం

హైదరాబాద్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చడమే లక్ష్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ఆకర్షించేలా హైదరాబాద్‌ను ఒక అంతర్జాతీయ క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు అంతర్జాతీయ టోర్నీలకు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిన అనుభవం భాగ్యనగరానికి ఉందని, ఈ హాకీ టోర్నీ కూడా ఘన విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు
రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనుందని మంత్రి శ్రీహరి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: