Telangana: తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్ అధిష్టానం జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను అప్పగించింది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయనను ప్రత్యేక అబ్జర్వర్‌గా (Special Observer) నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Read Also: artificial intelligence: కృత్రిమ మేధతో లాభాల పంట!
కర్ణాటక మంత్రితో కలిసి ఎన్నికల వ్యూహాలు
కేవలం పొన్నం ప్రభాకర్ మాత్రమే కాకుండా, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండు రావును కూడా మరో ప్రత్యేక అబ్జర్వర్‌గా కాంగ్రెస్ నియమించింది. వీరిద్దరూ కలిసి పుదుచ్చేరిలో పార్టీ బలోపేతం, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార సరళిని పర్యవేక్షించనున్నారు.ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ ప్రకటన విడుదల చేశారు.

పుదుచ్చేరిలో 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో, పుదుచ్చేరి రాజకీయాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. సీనియర్ నాయకులుగా ఉన్న వీరి అనుభవం పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు లాభిస్తుందని అధిష్టానం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: