हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

vote: ప్రజల ఓటు విలువ కోల్పోతుందా?

Sudha
vote: ప్రజల ఓటు విలువ కోల్పోతుందా?

ప్రజాస్వామ్యం అనే వ్యవస్థ ప్రజల చైతన్యంపై, స్వతంత్ర ఆలోచనలపై, బాధ్యతాయుత నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. కానీ కాలక్రమేణా రాజకీయ వ్యవస్థలో కొన్ని వికృత రూపాలు పుట్టుకొస్తాయి. వాటిలో ఒకటి ప్రాక్సీ రాజ కీయాలు లేదా ప్రతినిధి వెనుక మరొకరి అసలు ఆధిపత్యం. ఈ విధానం బహిరంగంగా కనిపించేది ఒక నాయకుడు, కానీ నిర్ణయాలు తీసుకునేది మరొకరు. ప్రజల ముందు నిలబడు వ్యక్తి ఒకరైతే, అసలు శక్తి కేంద్రం మరొకచోట ఉండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ప్రాక్సీ రాజకీ యాల భావన కొత్తది కాదు. స్థానిక సంస్థల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయివరకు వివిధ రూపాల్లో ఇది కనిపిస్తుంది. ఒక వ్యక్తి అధికారంలో ఉన్నప్పటికీ, అసలు నిర్ణయాధికారం అతని కుటుంబ సభ్యుడు, వ్యాపార భాగస్వామి, లేదా గోప్యంగా ప్రభావం చూపే వర్గం చేతుల్లో ఉండటం ఈ రాజకీయాల లక్షణం. ప్రజలు ఓటు వేయడం ఒకరికి, కానీ పాలన చేయడం మరొకరైతే అది ప్రజాస్వామ్య ఆత్మకు విరుద్ధం. ఇటీవలి కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు
పెరిగాయి. ఇది సమాన అవకాశాల దిశగా ఒక శుభపరిణామం. అయితే కొన్నిచోట్ల ఈ అవకాశాన్ని నిజమైన సాధికారతకు కాకుండా, ప్రాక్సీ రాజకీయాలకు వేదికగా మార్చడం బాధాకరం. మహిళ పేరుతో గెలిచి, పాలనను భర్త లేదా కుటుంబ సభ్యుడు నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. ఇది మహిళా సాధికారతకు విరుద్ధంగా ఉండటమే కాకుండా, ఓటర్ల నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుంది. ప్రాక్సీ రాజకీయాలు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిగా, అధికారాన్ని వదులుకోవా లనే మనస్తత్వం కొందరిలో లేకపోవడం.
రెండవది, రాజకీయాల్లో కుటుంబ ప్రభావం అధికంగా ఉండటం. మూడవది, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం బలహీనంగా ఉండటం. నాయకత్వ మార్పు సహజ ప్రక్రియగా కాకుండా, నియంత్రణ కోల్పోతామనే భయంతో కొందరు ప్రత్యక్షంగా కాకుండా పరో క్షంగా అధికారాన్ని కొనసాగించాలనుకుంటారు. ఈ ధోరణి సమాజంలో ఆరోగ్యకరమైన రాజకీయ సంస్కృతికి విఘాతం కలిగిస్తుంది. ప్రాక్సీ రాజకీయాల వల్ల కలిగే నష్టాలు స్పష్టంగా కనిపించకపోయినా, దీర్ఘకాలంలో తీవ్రమైన ప్రభావం చూపుతాయి. మొదటగా, బాధ్యతా రాహిత్యం పెరుగుతుంది.

Read Also : 2026 Nepal Elections : నేపాల్లో కొనసాగుతున్న పోలింగ్

vote
vote

అధికారంలో ఉన్నవారు నిర్ణయాలు తీసుకోకపోతే, లేదా తీసుకున్నా వాటికి బాధ్యత వహించకపోతే, పరిపాలనలో పారదర్శకత తగ్గిపోతుంది. రెండవది, ప్రజలలో రాజకీయాలపై నమ్మకం తగ్గుతుంది. ఓటు (vote) వేసిన వ్యక్తి నిర్ణయాలు తీసుకోకపోతే, ప్రజాస్వామ్య ప్రక్రియ అర్థహీన మవుతుంది. మూడవది, నైపుణ్యం, సామర్థ్యం కంటే సం బంధాలు ముఖ్యమవుతాయి. ఇది ప్రతిభావంతుల ప్రవేశా నికి అడ్డంకిగా మారుతుంది. ప్రాక్సీ రాజకీయాలు కేవలం అధికార నిర్వహణకే పరిమితం కావు. విధానాల రూపకల్ప న, కాంట్రాక్టుల కేటాయింపు, పరిపాలనా నిర్ణయాలన్నిం టిపై కూడా పరోక్ష ప్రభావం చూపుతాయి. ప్రజల ముందు జవాబుదారీతనం లేని శక్తి కేంద్రాలు ఏర్పడటం ప్రజాస్వా మ్యానికి ముప్పు. ఇవి పారదర్శకతను తగ్గించి, అవినీతి అవకాశాలను పెంచుతాయి. అయితే ఈ పరిస్థితిని పూర్తిగా నిరాశాజనకంగా చూడాల్సిన అవసరం లేదు. ప్రజల చైత న్యం పెరుగుతున్న కొద్దీ ప్రాక్సీ రాజకీయాలకు వ్యతిరేకంగా స్పందన కూడా పెరుగుతోంది. సామాజిక మాధ్యమాలు, పౌర సమాజ సంస్థలు, స్వతంత్ర మీడియా వంటి వేదికలు పరోక్ష ఆధిపత్యాలను వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు ప్రాక్సీ రాజకీయాలకు స్థలం తగ్గుతుంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం కొన్ని చర్యలు అవసరం. మొదటిగా, రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. నాయకత్వ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. రెండవది, ఎన్నికైన ప్రతి నిధుల బాధ్యతను స్పష్టంగా నిర్దేశించే చట్టపరమైన వ్యవస్థ అవసరం. నిర్ణయాధికారం ఎవరిదో స్పష్టంగా ఉండాలి. మూడవది, రాజకీయ విద్యను ప్రోత్సహించాలి. ఓటర్లకు తమ హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై అవ
గాహన పెరగాలి. మహిళలు, యువత, వెనుకబడిన వర్గా లు రాజకీయాల్లో నిజమైన భాగస్వాములుగా ఎదగాలంటే, వారికి స్వతంత్రంగా పనిచేసే అవకాశాలు కల్పించాలి. వారిని కేవలం పేరుకే నాయకులుగా ఉంచి, అసలు నిర్ణయాలు ఇతరులు తీసుకునే విధానం కొనసాగితే సమాజంలో అసమానతలు మరింత బలపడతాయి. నిజమైన సాధికారత అంటే స్వతంత్ర ఆలోచన, నిర్ణయ స్వేచ్చ, జవాబుదారీ తనం. ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేసే ప్రక్రియ కాదు; అది ప్రజలు పాల్గొనిక, పారదర్శకత, సమాన అవకాశాల సమ్మెళనం. ప్రాక్సీ రాజకీయాలు ఈ విలువలను క్రమంగా
క్షీణింపజేస్తాయి. అందువల్ల ప్రజలు, రాజకీయనాయకులు, పౌర సమాజం కలిసి ఈ ధోరణిని ప్రశ్నించాలి. అధికారాన్ని పరోక్షంగా వినియోగించే సంస్కృతి బలపడితే, ప్రజాస్వా మ్యం రూపంలో మాత్రమే మిగిలి, ఆత్మను కోల్పోయే ప్రమాదం ఉంది. ముగింపుగా చెప్పాలంటే, ప్రాక్సీ రాజకీయాలు తాత్కాలికంగా కొందరికి అనుకూలంగా కనిపించ వచ్చు. కానీ దీర్ఘకాలంలో అవి వ్యవస్థను బలహీనపరుస్తాయి. ప్రజాస్వామ్యానికి ప్రాణంపోసేది స్వతంత్ర నాయ కత్వం, పారదర్శక పాలన, ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడు కోవాలంటే ప్రాక్సీ రాజకీయాలకు తావు లేకుండా,నిజమైన ప్రజాప్రతినిధులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రజల ఓటు (vote) విలువను గౌరవించడం ప్రతిరాజకీయ వ్యవస్థ ధర్మం. అదే ప్రజ”స్వామ్యాన్ని బలోపేతం చేసేమార్గం.
-తిప్పర్తి శ్రీనివాస్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870