Assam: అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారుతోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.
Read Also: Central Government: గాడిదలు పెంచితే రూ.50 లక్షల సబ్సిడీ ఇవ్వనున్న కేంద్రం

సస్పెన్షన్ వేటు.. ఆపై ఫిరాయింపు
బుధవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా సమక్షంలో వీరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రజాప్రతినిధులు ఇలా పార్టీని వీడటం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇరకాటంలో పడేసింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఇటీవల సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌కు గురైన కొద్ది రోజుల్లోనే వీరు బీజేపీ గూటికి చేరారు. గత నెలలోనే పార్టీ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టడంతో ఎన్నికల బరిలో కాంగ్రెస్ ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: