AI Monitoring: బెంగళూరులోని టెక్నాలజీ ప్రొఫెషనల్ పంకజ్ తన్‌వార్ తన వంట గదిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను అమర్చాడు. ఇది కేవలం వినోదానికి కాకుండా, వంటగదిలోని కార్యకలాపాలను వాస్తవంగా ట్రాక్ చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. పంకజ్ తన వంట మనిషిపై అనుమానం వ్యక్తం చేసిన తర్వాత AI వ్యవస్థను అమర్చాడు. ఫలితంగా అతని ఫ్రిజ్‌లోని ఆపిల్, బ్లూబెర్రీ, అరటి వంటి పళ్ళు కొన్నిసార్లు దొంగిలిస్తున్నారని ఈ వ్యవస్థ వీడియో ద్వారా గుర్తించింది. AI కెమెరాలు, చాట్‌బాట్ విశ్లేషణలు ఉపయోగించి వంట మనిషి చేసిన ప్రతి చర్య, ఫ్రిజ్ తెరవడం, పళ్ళు తీసుకోవడం, చేతులు శుభ్రపరచడం, వంట గదిలోని ప్రవర్తనలు మొదలైన వాటిని ట్రాక్ చేసింది.
Read Also: Bihar Politics: బిహార్ సీఎం రేసులో ఇద్దరు బలమైన నేతలు

ఏఐ ఏం చెప్పిందంటే..?
వంట మనిషి చేతులు రెండు సార్లు శుభ్రపరచుకోలేదు. సాయంత్రం 7:12 గంటలకు వచ్చింది. రాగానే ఫ్రిడ్జ్ తెరిచింది. అందులో నుంచి రెండు యాపిల్స్ తీసి తన బ్యాగ్‌లో వేసుకుంది. అలాగే డస్ట్ బిన్ మూతను తాకింది. అనంతరం ముక్కు రుద్దుకుంది. ఆపై అదే చేతులతో చపాతీలు రుద్దింది. ఇక స్టవ్ వెనుక ఉన్న భాగాన్ని సోమవారం నుంచి ఆమె శుభ్రం చేయలేదని తెలిపింది. వారానికి ఒకసారి ఆ ఏఐ పంపే రిపోర్ట్‌లో అతనికి షాకింగ్ విషయాలు తెలిసాయి. రోజుకు ఎన్ని యాపిల్స్, అరటిపండ్లు మాయమయ్యాయి. ఆమె ఎన్ని బ్లూబెర్రీలు తిన్నది. ఈ మొత్తం లెక్కలతో సహా అతని ముందు ఉంచింది ఏఐ. కాగా వంట మనిషికి రూ.4,800 జీతం ఇస్తున్నారని ఏఐ సిస్టమ్ యజమానికి గుర్తు చేసింది. ఈ నివేదికల ఆధారంగా ఆ టెక్కీ సదరు వంట మనిషిని పనిలో నుంచి తొలగించాడు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
ఈ కథను షేర్ చేసిన తర్వాత X (Twitter) లో విభిన్న అభిప్రాయాలు వచ్చాయి. కొందరు AIను ఉపయోగించి నిజమైన పరిస్థితిని గమనించడాన్ని సమర్థించారు. మరికొందరు పళ్ళ విషయంలో పెద్ద పని చేయడం అవసరం లేదని విమర్శించారు. మరొకరు రూ. 4,800 నెల వేతనం పొందే వారిని పర్యవేక్షించడానికి AI వాడడం అవసరం లేదు ఇది గొప్ప విషయం కాదని చెప్పారు. మరికొందరు ఇంత నిశితంగా గమనిస్తే ఏ వంట మనిషీ మీ ఇంట్లో వారం కంటే ఎక్కువ ఉండదని చమత్కరించారు. ఇలాంటి టెక్నాలజీని ఏటీఎంలు, బస్సు స్టాపుల్లో వాడితే నేరాలను అరికట్టవచ్చని మరికొందరు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: