అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. అధికారంలోకి రాగానే అమలు చేసిన ట్రేడ్ టారిఫ్స్ పై మన్‌హట్టన్ (Manhattan court) అంతర్జాతీయ వాణిజ్య కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ట్రంప్ పాలనలో అమలు చేసిన టారిఫ్‌లు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ అక్రమ సుంకాలను చెల్లించిన దిగుమతిదారులకు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ట్రంప్ ప్రభుత్వానికి మాన్‌హట్టన్‌లోని US కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ టారిఫ్‌లు అక్రమంగా విధించబడ్డాయని తెలిపిన ధర్మాసనం.. వెంటనే టారిఫ్‌ల ద్వారా వసూలు చేసిన సుమారు 130 బిలియన్ డాలర్లను (సుమారు రూ.12 లక్షల కోట్లు) వడ్డీతో సహా దిగుమతిదారులకు తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2025లో రెండో సారి Trump బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్’ (IEEPA) కింద, ప్రపంచవ్యాప్తంగా వస్తువులపై 10 శాతం నుండి 18 శాతం వరకు పన్నులు విధించారు.
Read Also: Iran Israeli War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మరో రెండు వారాలు కొనసాగే అవకాశం

తీర్పును ట్రంప్ ప్రభుత్వం సవాలు చేసే అవకాశం?
అయితే, 2026 ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు ఈ పన్నులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. కోర్టు తీర్పులో.. పన్ను విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుంది. అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసింది. రిఫండ్ ప్రక్రియ సులభంగా ఉండేలా జడ్జి ఈటన్ ప్రభుత్వానికి కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. పన్ను వసూలు చేసిన రోజు నుంచి లెక్కించి వడ్డీతో సహా మొత్తం మొత్తాన్ని దిగుమతిదారులకు చెల్లించాల్సి ఉంటుంది. రిఫండ్‌లు చేయడం మీ సిస్టమ్‌కు కొత్త విషయం కాదు. వెంటనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసి వ్యాపారస్తుల డబ్బును తిరిగి ఇవ్వండని తెలిపారు. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పును సవాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆ సమయం వరకు ప్రభుత్వం.. ఫిబ్రవరి 24 నుంచి ‘సెక్షన్ 122’ కింద తాత్కాలికంగా 10 శాతం పన్నులను తిరిగి అమలు చేస్తోంది. ఈ తీర్పుతో సుమారు 3 లక్షల మంది దిగుమతిదారులు ఉపశమనం పొందుతారు. ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా… నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం.. ఈ రిఫండ్ నిర్ణయం అమెరికా వ్యాపార వర్గాలకు గణనీయమైన ఊరట కలిగించేలా ఉంది. ఇప్పటికే వసూలు చేసిన పన్నులను తిరిగి చెల్లించడం వల్ల..వ్యాపారాల ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: