Iran Israeli War: మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఇరాన్‌పై అమెరికా (America), ఇజ్రాయెల్ దళాలు జరుపుతున్న సంయుక్త దాడులు మరింత కాలం కొనసాగే అవకాశాలున్నట్లు సమాచారం. టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ భారీ సైనిక ఆపరేషన్ కనీసం మరో రెండు వారాల పాటు కొనసాగవచ్చని ఇజ్రాయెల్ మిలిటరీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి.ప్రధాన లక్ష్యం ఇరాన్ పాలన, సైనిక స్థావరాలను కూలదోయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ పునరుద్ఘాటించింది.
Read Also: Iran-US: హిందూ మహాసముద్రంలో రణరంగం: ఇరాన్ యుద్ధనౌకను ముంచేసిన అమెరికా

5 వేల బాంబులు.. వేలాది మంది సైనికుల మృతి
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బుధవారం వరకు తమ వైమానిక దళం ఇరాన్‌పై సుమారు 5,000కు పైగా బాంబులతో విరుచుకుపడిందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారికంగా వెల్లడించింది. ఈ భారీ దాడుల కారణంగా వేలాది మంది ఇరాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని, అనేక కీలక యుద్ధ విమానాలు, డ్రోన్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని సమాచారం. టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో వైమానిక దాడుల మోతతో భయానక వాతావరణం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: