हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Indrakeeladri: కుంభాభిషేక ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు.. మంత్రి ఆనం

Saritha
Indrakeeladri: కుంభాభిషేక ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు.. మంత్రి ఆనం

Indrakeeladri: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై ఈనెల 6 నుండి 8వ తేదీ వరకు జరగబోయే మహా కుంచాభిషేకం ఏర్పాట్లను రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana) బుధవారం పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే సుజానా చౌదరి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటర్ హరి జవహర్ లాల్, ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్లతో కలిసి నిర్వహించిన ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ భక్తులకు అందాల్సిన సౌకర్యాలు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. 12 ఏళ్ల తర్వాత వచ్చే ఈ అద్భుత ఆధ్యాత్మిక ఘట్టాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, విజయవంతంగా నిర్వహించేం దుకు ప్రభుత్వం, ఆలయ యంత్రాంగం కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలన్నారు.

పాలక మండలి కార్యాలయం లో నిర్వహించిన సమీక్షలో కుంభాభిషే కానికి వచ్చే భక్తుల కోసం చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. క్యూ లైన్ల ఆధునీకరణ, తాగునీటి సౌకర్యం, అన్నప్రసాదం మరియు లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్ల ఏర్పాట్లు దగైరా. నూతన ఘాట్ రోడ్డు కనెక్టివిటీ, ఎస్కలేటర్లు ఏర్పాటు వంటి శాశ్వత అభివృద్ధి పనుల సమీక్షించారు. తొలుత విమాన గోపురంపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, పనుల పురోగతిపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. మహామండపాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న కుంభాభిషేక ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధికి సంబంధించిన ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు.

Read Also: Central Government: ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ: కేంద్రం నిర్ణయం

Indrakeeladri: కుంభాభిషేక ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు.. మంత్రి ఆనం
Indrakeeladri: Strong arrangements for Kumbha Abhishek celebrations.. Minister Anam

కుంభిషేకంకు పటిష్ట ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్:

మహా కుంచాభిషేకం 2026 ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, మున్సివల్ కమిషనర్ జె. చంద్, విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, డీసీపీ గున్నం రామకృష్ణ తదితరులతో కలిసి బుధవారం పరిశీలిం చారు. ఆలయ క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, ఘాట్ రోడ్డు మరియు యాగశాల ప్రాంతాలను కలెక్టర్ బృందం సందర్శించింది.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్యం, తాగునీరు, అన్నప్రసాదం పంపిణీలో ఎక్కడా లోటు రాకూడదని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ మరియు డీసీపీ రామకృష్ణలతో కలిసి భద్రతా అంశాలపై కలెక్టర్ చర్చించారు. సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ.

తోపుబాటలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ వికె శీనా నాయక్, చైర్మన్ జొర్రా రాధాకృష్ణ, మహా కుంభాభిషేదం కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లను కలెక్టర్కు వివరించారు. విమాన గోపుర పనులు, రంగులు పనులు పూర్తయ్యాయని వారు పేర్కొన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, దర్శనం వేగంగా జరిగేలా చూడాలని, ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులందరికీ అమ్మవారి దర్శనం అత్యంత ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టిందని కలెక్టర్ వెల్లడించారు.

దుర్గమ్మవారి సేవలో సిఎండి అధికారి ప్రద్యుమ్న:

ముఖ్యమంత్రి కార్యాలయ సిఎంఓ ప్రద్యుమ్న కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మవారిని బుధవారం దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వదనం అందజేశారు. ఇది వికె సీనా నాయక్, చైర్మన్ బోర్రా రాధాకృష్ణలు శ్రీఅమ్మవారి శేషవస్త్రం, జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు. మార్చి 6 నుండి 8 వరకు జరగనున్న మహా కుంభాభిషేక మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఈ సందర్భంగా వారిని ఆహ్వానించారు. గో సంరక్షణ కోసం భారీ విరాళం విజయవాడకు చెందిన కె లీలా కుమారి, వారి కుటుంబ సభ్యులు గో సంరక్షణార్ధం రూ.1,01,116లను విరాళంగా బుధవారం అందజేశారు. ఆయా దాతలకు దుర్గమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసిన అధికారులు దుర్గమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలు అందించారు. వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870