हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Gudimallam Temple: ఏప్రిల్ 18 నుంచి గుడిమల్లం కుంభాభిషేకం

Tejaswini Y
Gudimallam Temple: ఏప్రిల్ 18 నుంచి గుడిమల్లం కుంభాభిషేకం

శ్రీకాళహస్తి రూరల్ : పురావస్తుశాఖ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఏర్పేడు మండలం గుడిమల్లం (Gudimallam Temple) ఆలయం కుంభాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 18 నుంచి 23వరకు కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నెల 7న బాలాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. గుడిమల్లం ఆలయం అతి పురాతనమైనది. 30 సంవత్సరాల ముందు శివరాత్రి సందర్భంగా అగ్నిప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగింది. దాంతో ఆలయంలో కుంభాభిషేకం జరపాల్సి ఉండగా ఏ కారణాల చేతనో నిర్వహించలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి దిశగా ప్రయాణం సాగిస్తున్నారు. ఆలయానికి ధర్మకర్తల మండలిని నియమించారు.

Read also: Siddipet: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు!

Gudimallam Temple: Gudimallam Kumbhabhishekam from April 18
Gudimallam Temple: Gudimallam Kumbhabhishekam from April 18

రూ.3 కోట్లతో రోడ్లు ఏర్పాటు

దేశంలో మొదటి శివాలయంగా గుర్తింపు పొందిన ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించుటకు చొరవ చూపారు. సాధారణంగా 12 సంవత్సరాలకొకమారు కుంబాభిషేకం జరగాలి. కానీ గుడిమల్లం ఆలయానికి ధర్మకర్తల మండలి లేకపోవటంతో ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ధర్మకర్తల మండలి చైర్మన్ బత్తల గిరిబాబునాయుడు ఇక్కడకు వచ్చే భక్తులకు. బస్సు సదుపాయం కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. గుడిమల్లం అభివృద్ధికి శాసనసభ్యుడు సుధీర్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. రూ.3 కోట్లతో రోడ్లు ఏర్పాటు చేశారు. ఆలయానికి సంబంధించి కట్టడాలు ధ్వంసం కాకుండా మరమ్మత్తులు చేపట్టి మహాకుంభాభిషేకం జరుపుటకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బత్తల గిరినాయుడు, పాలకమండలి సభ్యులు రాజకుమార్ నాయుడు, ఆరుణ, నిరంజన్, ఆలయ ఇఓ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. బాలాలయం సందర్భంగా 42 రోజుల పాటు అంతరాలయం ప్రవేశం ఉండదని వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870