US Iran War: ఇరాన్‌తో సాగుతున్న భీకర యుద్ధం అమెరికా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం, యుద్ధం ప్రారంభమైన కేవలం 24 గంటల్లోనే అమెరికా సుమారు 6,900 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఒకవేళ ఈ పోరు నెల రోజుల పాటు కొనసాగితే, మొత్తం వ్యయం ఏకంగా 18.87 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also: Aga Syed Ruhullah Mehdi: శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ పై కేసు నమోదు?

ఆకాశంలోనే ఆవిరవుతున్న కోట్లు
యుద్ధ విమానాల నిర్వహణ మరియు వైమానిక దాడుల కోసం అమెరికా ప్రతిరోజూ 58 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. అధునాతన ఆయుధాలు, ఇంధనం మరియు సైనిక మోహరింపు కోసం అవుతున్న ఈ ఖర్చు అమెరికా బడ్జెట్‌పై పెను భారాన్ని మోపుతోంది. ఇప్పటికే దేశీయంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యానికి ఈ యుద్ధం ‘పుండు మీద కారం’లా మారింది.
115 బిలియన్ డాలర్ల నష్టం పొంచి ఉందా?
యుద్ధం కేవలం ఆయుధాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా పడింది. చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటం మరియు సముద్ర మార్గాల్లో రవాణా నిలిచిపోవడంతో అమెరికాకు సుమారు 115 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాణిజ్య లోటు పెరగడం వల్ల సామాన్యులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: