Ownly Food Delivery: ప్రముఖ రైడ్-హేయింగ్ ప్లాట్‌ఫారమ్ ర్యాపిడో (Rapido), ఫుడ్ డెలివరీ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. తన సరికొత్త యాప్ ‘ఓన్లీ’ (Ownly) సేవలను ఇప్పుడు బెంగళూరు నగరం అంతటా విస్తరించింది. గత ఏడు నెలలుగా కోరమంగళ, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ వంటి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సేవలను పరీక్షించిన తర్వాత, సానుకూల ఫలితాలు రావడంతో పూర్తిస్థాయిలో కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించింది.

జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీ
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న జొమాటో, స్విగ్గీ వంటి దిగ్గజ సంస్థలు రెస్టారెంట్ల నుండి ప్రతి ఆర్డర్‌పై 16% నుండి 30% వరకు భారీ కమీషన్లను వసూలు చేస్తున్నాయి. దీనికి భిన్నంగా ‘ఓన్లీ’ ఒక విప్లవాత్మకమైన ఫిక్స్‌డ్ ఫీజు (Fixed Fee) నమూనాను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ₹400 కంటే తక్కువ విలువైన ఆర్డర్లకు కేవలం ₹25, అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్లకు ₹50 మాత్రమే సర్వీస్ ఛార్జీగా వసూలు చేయనుంది.
ఈ కొత్త ధరల విధానం వల్ల రెస్టారెంట్ యజమానులకు కమీషన్ భారం తగ్గి లాభాలు పెరిగే అవకాశం ఉంది. కమీషన్ల భారం తగ్గడం వల్ల వినియోగదారులకు కూడా తక్కువ ధరకే ఆహారం అందే వీలుంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగళూరులో సక్సెస్ అయితే, త్వరలోనే ఇతర మెట్రో నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించాలని ర్యాపిడో యోచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: