పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సాగుతున్న పోరు ఐదో రోజుకు చేరుకుంది. ఈ యుద్ధానికి అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) అని నామకరణం చేసింది. ఈ భీకర దాడుల ప్రభావం గల్ఫ్ దేశాలన్నింటిపై స్పష్టంగా కనిపిస్తోంది. సౌదీ అరేబియా నుండి బహ్రెయిన్ వరకు ఉన్న అమెరికా సైనిక స్థావరాలు (Air Bases), రాయబార కార్యాలయాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పరిస్థితి క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారుతోంది.
Read Also: Iran: చమురు సంక్షోభంపై భారత్‌కు అండగా రష్యా కీలక ప్రకటన

మూడు రౌండ్ల చర్చలు విఫలం కావడంతోనే దాడులు
ఈ యుద్ధం అనివార్యం కావడానికి గల కారణాలను అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) మరియు వైట్ హౌస్ ప్రతినిధులు తాజాగా వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమాలను నియంత్రించేందుకు ఒమన్, స్విట్జర్లాండ్ వేదికలుగా జరిగిన మూడు రౌండ్ల దౌత్యపరమైన చర్చలు పూర్తిగా విఫలం కావడమే ఈ దాడులకు ప్రధాన కారణమని వారు స్పష్టం చేశారు. అణ్వాయుధాలను వదులుకునే విషయంలో ఇరాన్ ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని, చర్చల పేరుతో సమయాన్ని వృథా చేసిందని అమెరికా ఆరోపించింది.
వైట్ హౌస్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. చర్చల సందర్భంగా ఇరాన్‌కు పలు ప్రోత్సాహకాలను ఆశగా చూపినప్పటికీ, వారు కఠినమైన షరతులకు తలొగ్గలేదు. మొదటి రౌండ్ చర్చల్లోనే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చి అణ్వాయుధాలను తమ దేశ హక్కుగా అభివర్ణించారని, ఇది ఒక రకమైన బెదిరింపు ధోరణిని సూచించిందని పెంటగాన్ పేర్కొంది. సైనిక చర్యతో సాధించలేని ఏ విషయాన్నీ దౌత్యం ద్వారా తాము వదులుకోబోమని ఆయన స్పష్టం చేసినట్లు అమెరికా ప్రతినిధులు తెలిపారు.
ప్రస్తుతం ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన సుమారు 460 కిలోగ్రాముల యురేనియం నిల్వలు ఉన్నాయని, వీటితో కనీసం 11 అణు బాంబులను తయారు చేసే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. రెండో రౌండ్ చర్చలకు ముందు కుదుర్చుకున్న ముసాయిదా (Draft) ఒప్పందాన్ని కూడా ఇరాన్ ఉల్లంఘించిందని, దీంతో ఇక దౌత్యపరమైన చర్చలు ఫలించవని భావించిన అమెరికా, వెంటనే ‘ఎపిక్ ఫ్యూరీ’ని ప్రారంభించినట్లు వివరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: