
Road Accident: ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తున్న ఓ పికప్ ట్రక్కు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ప్రయాణికులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోవడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.
ఈ విషాద ఘటనలో వాహన డ్రైవర్ మురారి (25) తో పాటు, మూడేళ్ల పసి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహనంలో ఉన్న మరో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: India’s Nuclear Power: అణుశక్తితో భారత్ బలోపేతం
ప్రమాదానికి కారణం నిద్రమత్తేనా?
ప్రమాద సమయంలో వాహనం అత్యంత వేగంతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారడం వల్లే స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయి, వాహనం డివైడర్ను ఢీకొట్టిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ట్రక్కు డివైడర్ను ఢీకొన్న వేగానికి ప్రయాణికులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటం చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో అర్థమవుతోంది. ఈ ఘటనపై ఉన్నావ్ పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: