Collectors Meetings: అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు.
Read Also: Medchal crime: ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అధికారులు, కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల పాలనను సమీక్షించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు.
ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిని ఈ సందర్భంగా సీఎం మరియు మంత్రులు అధికారులతో కలిసి చర్చిస్తున్నారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను సీఎం ఆదేశించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: