Yadadri Bhongir: యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలు ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్నాయి. బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఐశ్వర్య, తన ఇద్దరు బిడ్డలను హతమార్చి, అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న వివాదాలే ఈ దారుణానికి దారితీశాయని తెలుస్తోంది.
Read Also:Kaleshwaram Case: ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ
పోలీసుల కథనం ప్రకారం, మేకల మహేశ్ యాదవ్ మరియు ఐశ్వర్య దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఐశ్వర్య, పిల్లలతో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, కుటుంబ సభ్యులు ఆమెకు సర్దిచెప్పి సోమవారమే తిరిగి అత్తగారి ఇంటికి పంపించారు. కానీ, పుట్టింటి వారు వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఆమె ఈ ఘోర నిర్ణయం తీసుకుంది.
సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో, ఐశ్వర్య తన ఇద్దరు చిన్నారులను దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. బిడ్డల ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్నాక, అదే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హృదయ విదారక ఘటనతో గొల్లగూడెం గ్రామం మూగబోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: