हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

Kaleshwaram Case: ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

Tejaswini Y
Kaleshwaram Case: ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

Kaleshwaram Case: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో విచారణ జరిగింది. నివేదికను రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రరావు, ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తరఫున నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసీఆర్ తరుపున లాయర్లు వాదనలు వినిపించారు.

Read Also: Majid Ebnelreza appointment : యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్

Kaleshwaram Case: High Court hearing on Ghosh Commission report
Kaleshwaram Case: High Court hearing on Ghosh Commission report

సాక్షులు ఎవరైనా పిటిషనర్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు నోటీస్ జారీ చేసి వారి వాదన వినాలని చట్టం చెబుతుందని కేసీఆర్ తరఫు న్యాయవాది వెల్లడించారు. నివేదికలో తీవ్ర ఆరోపణలు చేయడం పిటిషనర్ పరువు, కీర్తికి నష్టం కలిగేలా చేయడం సరైంది కాదని హైకోర్టుకు తెలిపారు. ఈసమయంలో ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కూడా పలు కీలక అంశాలను ధర్మాసనం ముందుంచారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో తెలుసుకునే హక్కు
ప్రభుత్వానికి ఉందని, కేసీఆర్, హరీష్రరావుకు విచారణ కమిషన్ తగిన అవకాశం ఇచ్చిందన్నారు. తన విధులు నిర్వహించడం లో స్మితా సబర్వాల్ విఫలమయ్యారని నివేదికలో ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

హైకోర్టు తదుపరి విచారణ

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 2.15కు వాయిదా వేసింది. కాగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్ నేతృత్వంలోని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసి రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గతంలో కేసీఆర్, హరీశ్రవులు ఇచ్చిన పిటిషన్లో పేర్కొన్నారు. నివేదిక కాపీని అందజేయకుండా ప్రభుత్వం మీడియా ప్రచురణలకు ఇవ్వడంలో దురుద్దేశపూరితం, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో డిజైనింగ్ లోపాలు, ప్రణాళిక సహా అన్నింటికీ సీఎంగా తానే బాధ్యుడినంటూ జస్టిస్ ఘోష్ కమిషన్ ఏవిధంగా నిర్ణయించిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వం అందించిన రికార్డుల ఆధారంగా నిర్ణయించడం సరికాదని ఆయన అన్నారు.

అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను సమర్పించి వివరణ తీసుకున్నాక మాత్రమే ఓ నిర్ధారణకు రావాల్సి ఉంటుందన్నారు. అయితే కమిషన్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందని హైకోర్టుకు నివేదించారు. సాక్షి గా పిలిచి దోషిగా అభియోగాలు మోపారని కేసీఆర్ తన పిటిషన్లో తెలిపారు. తన ప్రతిష్ఠ దెబ్బతీసేలా నిర్ధరణ ఉన్నప్పుడు, అందుకు గల ప్రాతిపదికను సెక్షన్ 8 బీ, సీ ప్రకారం నోటీసు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. పిటిషనర్కు వ్యతిరేకంగా అభియోగాలు మోపిన వారి వివరాలు చెప్పలేదన్న కేసీఆర్, వాంగ్మూలం ఇచ్చిన వారిని ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గాయి

మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గాయి

ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు ఎపిఐటిసిఓ బృందం పరిశీలన

ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు ఎపిఐటిసిఓ బృందం పరిశీలన

భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

బాల్క సుమన్ కు షరతులతో బెయిల్

బాల్క సుమన్ కు షరతులతో బెయిల్

సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల పంపిణీ

సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల పంపిణీ

చంద్రబాబుతో పవన్ కీలక భేటీ

చంద్రబాబుతో పవన్ కీలక భేటీ

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

దుబాయ్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు!

దుబాయ్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు!

ఇంతకీ నెతన్యాహు ఎక్కడ? కొనసాగుతున్న సస్పెన్స్

ఇంతకీ నెతన్యాహు ఎక్కడ? కొనసాగుతున్న సస్పెన్స్

📢 For Advertisement Booking: 98481 12870