Iran: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఇంధన రవాణాకు వెన్నెముక వంటి హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) అధికారికంగా మూసివేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. తమ అనుమతి లేకుండా ఈ మార్గంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ధ్వంసం చేస్తామని, అవసరమైతే తగలబెట్టేస్తామని ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం IRGC తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో పెను అలజడి మొదలైంది.
Iran Closes Strait of Hormuz : హార్ముజ్ బంద్.. భారత్ కు నిలిచిన క్రూడాయిల్

హార్ముజ్ జలసంధి ప్రాముఖ్యత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే మొత్తం ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ సన్నని జలమార్గం గుండానే రవాణా అవుతుంది. వాస్తవానికి, ఇరాన్ దాడులు చేస్తోందన్న భయాందోళనల మధ్య మార్చి 1వ తేదీ నుంచే వాణిజ్య నౌకలు ఈ మార్గంలో ప్రయాణించడం నిలిపివేశాయి. ఇప్పుడు అధికారిక ప్రకటన వెలువడటంతో అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు భారీ విఘాతం కలిగింది.
యుద్ధం మరోవైపు మరింత ఉధృతమైంది. పశ్చిమాసియాలోనే అత్యంత భారీ సైనిక కేంద్రంగా పేరొందిన కువైట్‌లోని అమెరికన్ మిలిటరీ బేస్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో అమెరికా సైనిక సంపత్తికి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇరాన్ వరుసగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతో, అగ్రరాజ్యం తన తదుపరి వ్యూహాలపై తీవ్రంగా మంతనాలు జరుపుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: