
Peddi Movie Update: రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్‌లో నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ పెద్ది (Peddi). స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా గా వస్తోన్న ఈ చిత్రానికి ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. పెద్ది నుంచి ఇప్పటికే విడుదల చేసిన చికిరి చికిరి సాంగ్ ఇండియాతోపాటు వరల్డ్‌వైడ్‌గా మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు (మార్చి 2) విడుదలైన రెండో పాట ‘రై రై రా రా’ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Read Also: Boyapati Srinu Tirumala Visit: శ్రీవారి సేవలో డైరెక్టర్ బోయపాటి కుటుంబం
ఏఆర్ రెహమాన్ గాత్రంలో మాస్ ఎలివేషన్
ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ పాటను ఆయనే స్వయంగా ఆలపించడం గమనార్హం. పక్కా మాస్ బీట్, హీరో ఎలివేషన్ థీమ్‌తో సాగే ఈ గీతంలో ఇంటెన్స్ ఫోక్ పెర్కషన్ (Folk Percussion) వినసొంపుగా ఉంది. పక్కా మాస్ బీట్, హీరో ఎలివేషన్ థీమ్‌తో సాగే ఈ పాటలో ఇంటెన్స్ ఫోక్ పెర్కషన్ హైలైట్‌గా నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో సాగే విజయ గీతంలా ఇది రూపొందింది. ముఖ్యంగా ‘రై రై రా రా’ అనే హుక్ లైన్ వినగానే ఆకట్టుకునేలా ఉందని, థియేటర్లలో ఈ పాటకు రెస్పాన్స్ గట్టిగా ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొన్ని షూటింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ముందుగా ప్రకటించినట్లే ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: