F15 Strike Eagle : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య కువైట్ గగనతలంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇరాన్‌పై నిర్వహిస్తున్న సైనిక చర్యల సమయంలో ఆపరేషన్‌లో పాల్గొంటున్న అమెరికా F-15E Strike Eagle యుద్ధ విమానాల్లో మూడు కూలిపోయాయి. ఈ ఘటన శత్రు దాడి వల్ల కాదని, మిత్రదేశమైన Kuwait ఎయిర్ డిఫెన్స్ దళాలు పొరపాటున కాల్పులు జరపడంతో జరిగిన ‘ఫ్రెండ్లీ ఫైర్’ ఘటనగా United States Central Command వెల్లడించింది.
అమెరికా కాలమానం ప్రకారం మార్చి 1 రాత్రి జరిగిన ఈ ఘటన సమయంలో ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడులు జరుగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికా విమానాలను శత్రు లక్ష్యాలుగా పొరబడిన కువైట్ రక్షణ దళాలు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
Read Also: ZIM vs SA: జింబాబ్వే టార్గెట్ 154.. సికందర్ రజా హాఫ్ సెంచరీ మెరుపులు!

అదృష్టవశాత్తు మూడు విమానాల్లో ఉన్న ఆరుగురు ఎయిర్‌క్రూ సభ్యులు పారాచూట్ల సహాయంతో సురక్షితంగా దిగారు. వారిని వెంటనే రక్షించి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనను కువైట్ అధికారులు పొరపాటు చర్యగా అంగీకరించినట్లు సమాచారం. క్లిష్ట పరిస్థితుల్లో కువైట్ అందిస్తున్న సహకారానికి అమెరికా కృతజ్ఞతలు తెలిపింది. ఘటనకు కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: