हिन्दी | Epaper

thieves : కూరగాయల సంతలో దొంగల బీభత్సం

Sudha
thieves : కూరగాయల సంతలో దొంగల బీభత్సం

బంగారం ధరలు పెరగడంతో చోరీలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. బంగారం ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. తాజాగా మెదక్ జిల్లాలో దొంగలు (thieves)భత్సం సృష్టించారు. రద్దీగా ఉండే మాంబోజీపల్లి మార్కెట్ (సంత)లో పట్టపగలే చేతివాటం ప్రదర్శించారు దుండగులు. కూరగాయలు కొనేందుకు వెళ్లిన దంపతులను టార్గెట్ చేశారు. ఏకంగా 8 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also : Guntakal: రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

thieves
thieves

కొల్చారం మండలానికి చెందిన చింతలగారి శ్రావణి – ప్రవీణ్ దంపతులిద్దరూ మెదక్ వెళ్లి తిరిగి వస్తున్నారు. దారిలో మాంబోజీపల్లి సంతలో కూరగాయలు తీసుకునేందుకు ఆగారు. ఆ సమయంలో రద్దీని అదునుగా తీసుకున్న గుర్తు తెలియని మాయగాళ్లు (thieves)శ్రావణి హ్యాండ్ బ్యాగులోని నగలను మాయం చేశారు. 2.5 తులాల బంగారు నెక్లెస్, 2 తులాల నల్లపూసల గొలుసు, అర తులం బరువున్న మాటీలు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లారు. మొత్తం వీటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని దంపతులు తెలిపారు. మార్కెట్‌లో కూరగాయలు తీసుకున్న కాసేపటికే బ్యాగ్ తనిఖీ చేసిన శ్రావణి.. అందులో నగలు లేకపోవడంతో షాక్‌కు గురయ్యారు. సంతలో అటు ఇటు వెతికినా ఫలితం లేకపోయింది. హుటాహుటిన బాధితులు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సంతలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుల కదలికలను పోలీసులు పరిశీలించారు. జనసందోహం ఎక్కువగా ఉండే సంతలు, మార్కెట్లలో మహిళలు తమ నగలు, బ్యాగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870