हिन्दी | Epaper

Cases on Dhara Bhaskar: నాపై అక్రమ కేసులు పెట్టారు.. దారా భాస్కర్ సంచలన వ్యాఖ్యలు!

Tejaswini Y
Cases on Dhara Bhaskar: Illegal cases have been filed against me.. Dara Bhaskar's sensational comments!
Cases on Dhara Bhaskar: Illegal cases have been filed against me.. Dara Bhaskar’s sensational comments!

Cases on Dhara Bhaskar: తాను అన్యాయాన్ని ప్రశ్నించినందుకు పేద ప్రజల భూములను లాక్కుంటున్న దుర్మార్గుల గురించి మాట్లాడినందుకే తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని టిపిసిసి కోఆర్డినేటర్ దారా భాస్కర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డి అక్రమాలను తాను ప్రశ్నిస్తున్నందుకే కక్షపూరిత ధోరణితో తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

Read Also: Khamenei death: ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు

మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఎస్సై విక్రం తనపై నమోదు చేసిన తప్పుడు కేసు అని తెలిపారు. బిజెపి మనస్తత్వం కలిగిన నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్లే నికార్సైన కాంగ్రెస్ నేతలుగా తాము ఈరోజు బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అక్రమ కేసుల నమోదు కు కారకులైన ఏ ఒక్కరిని వదిలి పెట్టమని చట్టం న్యాయస్థానం ద్వారా వారికి శిక్ష పడేలా చూస్తామని అన్నారు. అంబేద్కర్ గాంధీజీ భావాలను ఆదర్శాలను కలిగిన వ్యక్తిగా అహింస మార్గంలోనే తాను ముందుకు వెళ్తానని చట్టం ముందు దోషులుగా నిలబెడతానని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870