हिन्दी | Epaper

Iran: సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపిన విధానం

Vanipushpa
Iran: సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపిన విధానం

ఇరాన్‌పై తమ తొలి దాడిలో దేశ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei)తో పాటు 40 మంది సీనియర్ కమాండర్లు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం తెలిపింది. “ఈ ఆపరేషన్ మొదటి అడుగు ఖమేనీతో సహా 40 మంది సీనియర్ కమాండర్లను పట్టపగలు ఇజ్రాయెల్ నుంచి వెయ్యి మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న రెండు వేర్వేరు ప్రదేశాలలో ఒక నిమిషంలో హతమార్చడం” అని సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నాదవ్ షోషాని తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి సంతాపం తెలిపేందుకు వేలాది మంది ఇరానియన్లు వీధులు, కూడళ్లలో గుమిగూడారు. వారంతా ఖమేనీ ఫొటోలను చేతిలో పట్టుకొని అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ హత్య జరిగిన అనంతరం పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్ వెలుపల పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ గొడవలో దాదాపు ఆరుగురు చనిపోగా, పలువురు గాయపడ్డారు.

Read Also: Iran Israel War: దుబాయ్‌లో చిక్కుకున్న సినీ ప్రముఖులు

 How Supreme Leader Ayatollah Ali Khamenei was killed
How Supreme Leader Ayatollah Ali Khamenei was killed

తొలుత డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడి

తమ దాడుల్లో ఖమేనీ చనిపోయారని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత, దీనిపై ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతో పాటు సన్నిహిత సలహాదారు అలీ షంఖానీ, జనరల్ అబ్దుల్ రహీం మౌసావి, రక్షణ మంత్రి జనరల్ అజీజ్ నాసిర్జాదే, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్ మొహమ్మద్ పక్‌పూర్ చనిపోయారని ఆ వార్తలలో ప్రస్తావించారు. ఫిబ్రవరి 28, 2026 ఉదయం 10 గంటల సమయంలో టెహ్రాన్ నగరం ఒక్కసారిగా బాంబుల మోతతో ఉలిక్కిపడింది. నేడు అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ (86) మృతి చెందినట్లు ఇరాన్ రాష్ట్ర మీడియా అధికారికంగా ప్రకటించింది.

కోడ్‌నేమ్ “Operation Epic Fury”

ఈ దాడి అమెరికా కోడ్‌నేమ్ “Operation Epic Fury”, ఇజ్రాయెల్ కోడ్‌నేమ్ “Operation Lion’s Roar” పేర్లతో నెలలపాటు ప్రణాళికాబద్ధంగా, అత్యంత పకడ్బందీగా అమలు చేయబడింది. 2025 చివరి నుంచి అమెరికా–ఇజ్రాయెల్ మధ్య రహస్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ అణు కార్యక్రమం వేగవంతమవుతోందనే ఆందోళన, క్షిపణి సామర్థ్యాల విస్తరణ, ప్రాంతీయ ఉగ్రవాదానికి మద్దతు వంటి అంశాలు ఈ నిర్ణయానికి దారితీశాయి. CIA, CENTCOM మరియు ఇజ్రాయెల్ మొసాద్ మధ్య సమన్వయం నెలలపాటు కొనసాగింది. ఉపగ్రహ పర్యవేక్షణ, సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ ద్వారా ఖమేనీ కదలికలు, సమావేశాల సమయాలు, భద్రతా ఏర్పాట్లు ట్రాక్ చేయబడ్డాయి. ఇజ్రాయెల్ వైపు ‘Operation Lion’s Roar’, అమెరికా వైపు ‘Operation Epic Fury’ పేర్లతో దాడి దశల వారీగా ప్రణాళిక రూపొందించారు. ముందుగా ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, తరువాత నాయకత్వ సమావేశ సముదాయంపై కేంద్రీకృత దాడి చేయాలని నిర్ణయించారు.

దాడి సమయం మార్పు: రాత్రి నుంచి ఉదయం వరకు వ్యూహాత్మక షిఫ్ట్

మొదట దాడిని రాత్రి (PM) సమయంలో అమలు చేయాలని భావించినట్టు సమాచారం. సాధారణంగా రాత్రి వేళల్లోనే తొలి దెబ్బ ఇస్తారు. అయితే చివరి క్షణాల్లో ఇంటెలిజెన్స్ ఆధారంగా దాడి సమయాన్ని మార్చారు. టెహ్రాన్‌లోని ఖమేనీ అధికార నివాసం, బైత్​–ఎ_రహ్బరీలో అధినేత, ఇతర అత్యన్నత నాయకులు ఉదయం సమావేశం కాబోతున్నారన పక్కా సమాచారంతోనే దాడి సమయంలో మార్పు జరిగింది. ఈ మార్పు ద్వారా అమెరికా–ఇజ్రాయెల్​ వ్యూహాత్మక విజయం సాధించారని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఖమేనీ నివాస-కార్యాలయ సముదాయం ‘బైత్–ఎ–రహ్బరి’పై మొదటి, కీలక దాడి ఇజ్రాయెల్ జెట్లు చేపట్టాయి. ఈ ఇజ్రాయెల్ దాడివల్లే ఖమేనీ, అతని కుటుంబసభ్యులు, ఇతర అత్యున్నత నాయకులు హతమయ్యారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, ప్రధాని నెతన్యాహు అధికారికంగా చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

‘నెతన్యాహు కార్యాలయంపై దాడి చేశాం’..ఇరాన్‌

‘నెతన్యాహు కార్యాలయంపై దాడి చేశాం’..ఇరాన్‌

“మహిళా వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.

“మహిళా వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.

గల్ఫ్ దేశాల నగరాల్లో బాంబుల మోత

గల్ఫ్ దేశాల నగరాల్లో బాంబుల మోత

ఖమేనీ మరణం..ఆ యువతి వీడియోలు వైరల్

ఖమేనీ మరణం..ఆ యువతి వీడియోలు వైరల్

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇరాన్ సైన్యంలో మహిళా సైనికుల పాత్ర ?

ఇరాన్ సైన్యంలో మహిళా సైనికుల పాత్ర ?

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..భారత్‌కు తీవ్ర ఆందోళన అన్న మోదీ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..భారత్‌కు తీవ్ర ఆందోళన అన్న మోదీ

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

📢 For Advertisement Booking: 98481 12870