हिन्दी | Epaper

Israel-Hezbollah War: 50 గ్రామాలు ఖాళీ చేయాలని లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

Anusha
Israel-Hezbollah War: 50 గ్రామాలు ఖాళీ చేయాలని లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

Israel-Hezbollah War: మధ్యప్రాచ్యంలో పరిస్థితులు సెకనుకో తీరుగా మారుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఈ ప్రాంతంలో ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరుగుతున్న దాడులు ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తున్నాయి. తాజాగా లెబనాన్‌ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

Read Also: Iran-Israel War : యుద్ధంలోకి హెజ్బొల్లా ఎంట్రీ

50 గ్రామాలకు ఖాళీ చేయాలని ఐడీఎఫ్ హెచ్చరిక

లెబనాన్‌లోని సుమారు 50 గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వెంటనే వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) సోమవారం అధికారికంగా హెచ్చరించింది. హెజ్బొల్లా ఉగ్రవాదులు పౌర నివాసాలనే తమ సైనిక స్థావరాలుగా వాడుకుంటున్నారని, ఆ ప్రాంతాలపై దాడులు చేసే సమయంలో సామాన్యులకు ప్రాణనష్టం జరగకూడదన్నదే తమ ఉద్దేశమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ప్రజలు తమ గ్రామాలకు కనీసం 1000 మీటర్ల దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది.

Israel-Hezbollah War: Israel warns Lebanese people to evacuate 50 villages
Israel-Hezbollah War: Israel warns Lebanese people to evacuate 50 villages

బీరుట్‌ను వణికించిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’

ఈ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్‌పై విరుచుకుపడ్డాయి. రాజధాని బీరుట్‌తో పాటు దక్షిణ, తూర్పు లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. 2024 యుద్ధం తర్వాత బీరుట్ నగరం ఈ స్థాయిలో కంపించిపోవడం ఇదే మొదటిసారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ ఈ దాడులను చేపట్టింది.ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా గ్రూపు.. ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడటంతో ఇజ్రాయెల్ ఈ తీవ్ర ప్రతిచర్యకు దిగింది. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్ గెలుపు కేవలం ‘అదృష్టమే’: షోయబ్ అక్తర్ విమర్శలు!

భారత్ గెలుపు కేవలం ‘అదృష్టమే’: షోయబ్ అక్తర్ విమర్శలు!

శ్రీసత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం

శ్రీసత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం

స్వామివారి సొమ్ము తింటే పాపం ఊరికే పోదు..
0:30

స్వామివారి సొమ్ము తింటే పాపం ఊరికే పోదు..

అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీపై ఇరాన్‌ డ్రోన్ల దాడి
0:14

అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీపై ఇరాన్‌ డ్రోన్ల దాడి

అమెరికా ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు!
0:30

అమెరికా ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు!

నాపై అక్రమ కేసులు పెట్టారు.. దారా భాస్కర్ సంచలన వ్యాఖ్యలు!
1:47

నాపై అక్రమ కేసులు పెట్టారు.. దారా భాస్కర్ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ విద్యావేత్త మాజీ ఎంపీ వాఘ్మారే కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త మాజీ ఎంపీ వాఘ్మారే కన్నుమూత

ఆకాశంలో అజేయ మృత్యుపాశం!

ఆకాశంలో అజేయ మృత్యుపాశం!

కువైట్‌లో అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేత
0:28

కువైట్‌లో అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేత

ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన!

ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన!

ఫినో బ్యాంక్ సీఈవో రిషిగుప్తా అరెస్ట్

ఫినో బ్యాంక్ సీఈవో రిషిగుప్తా అరెస్ట్

ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత మహమ్మద్ రాడ్ మృతి?

ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత మహమ్మద్ రాడ్ మృతి?

📢 For Advertisement Booking: 98481 12870