Modi Netanyahu call : ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei మరణంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని Narendra Modi ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahuతో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
ఇక ఇరాన్ యూఏఈపై చేసిన దాడులను కూడా ప్రధాని మోదీ ఖండించారు. ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ, United Arab Emirates కు భారత్ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం యూఏఈ అధ్యక్షుడు Mohamed bin Zayed Al Nahyan తో కూడా మాట్లాడి సంఘీభావం తెలిపారు.
Read Also: ZIM vs SA: జింబాబ్వే టార్గెట్ 154.. సికందర్ రజా హాఫ్ సెంచరీ మెరుపులు!
అత్యవసర CCS సమావేశం
మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో (Modi Netanyahu call) ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో Rajnath Singh, Amit Shah, S. Jaishankar తదితరులు పాల్గొన్నారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన పరిస్థితి భారత్‌పై చూపే ప్రభావాన్ని సమీక్షించినట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో ఉన్న భారతీయుల భద్రత, పరిస్థితులు మరింత దిగజారితే చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
ప్రస్తుతం ఇరాన్లో సుమారు 10,000 మంది భారతీయులు, ఇజ్రాయెల్‌లో 40,000 మందికి పైగా, గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో వారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి భారత రాయబార కార్యాలయాలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: