National Science Day 2026: భారతదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవం గా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం సర్ సి.వి. రామన్ చేసిన Raman Effect ఆవిష్కరణ. 1928 ఫిబ్రవరి 28న ఆయన కాంతి పరిక్షేపణ (Scattering of Light) సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. దేశంలో సైంటిఫిక్ టెంపర్, రీసెర్చ్, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడానికి ఏటా ఈ రోజున ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఈ గొప్ప విజయానికి గుర్తింపుగా 1930లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.
Read Also: Kohitur Mango: ఒక్క మామిడి పండు ధర రూ. 12 వేలు..

సీవీ రామన్ వివరాలు..
సీవీ రామన్ అసలు పేరు.. చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబరు 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. సి.వి.రామన్ తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతిక శాస్త్రం వైపు కుతూహలం పెంచుకునేలా చేసింది.
చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్ లో, గోల్డెమెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. తన 18వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఆయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్ లో, ప్రచురితమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: