हिन्दी | Epaper

AP Re-survey: రాష్ట్రంలో 7926 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

Saritha
AP Re-survey: రాష్ట్రంలో 7926 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

ఇప్పటి వరకు 19 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

AP Re-survey: రాష్ట్రంలో ఇప్పటి వరకు 19 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసినట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Satya Prasad) తెలిపారు. రాష్ట్రంలో 7926 గ్రామాల్లో రీ సర్వే పూర్తి అయినట్లు వివరించారు. శాసనసభలో గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు రీ సర్వేపై అడిగిన ప్రశ్నకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో తొందరపాటు కారణంగా తప్పుల తడకగా రీ సర్వే సాగిందని అన్నారు. రీ సర్వే 1.0పై గ్రామ సభలు నిర్వహిస్తే 2.79 లక్షల ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వీటిల్లో విస్తీర్ణం తేడాలకు సంబంధించి ఇప్పటికే 98 శాతం సమస్యలను పరిష్కరించామని చెప్పారు. దాదాపు 7.5 లక్షల జాయింట్ జాయింట్ ఎల్పీఎమ్ ల సమస్యలు వచ్చాయని, వాటిల్లో 2.98 లక్షలు పరిష్కరించామన్నారు. మిగిలిన వాటిని మార్చి నెలాఖరు లోపు పరిష్కరిస్తామని చెప్పారు.

Read Also: Speaker Ayyanna Patrudu: విశాఖ వేదికగా దక్షిణాది రాష్ట్రాల ఎమ్మెల్యేల క్రీడాపోటీలు

AP Re-survey: రాష్ట్రంలో 7926 గ్రామాల్లో రీ సర్వే పూర్తి
AP Re-survey: Re-survey completed in 7926 villages in the state

గత ప్రభుత్వ లోపాలు

గత ప్రభుత్వం రీసర్వే 1.0 లో ప్రభుత్వ భూముల రీసర్వేకు మాత్రమే రోవర్స్ ను ఉపయోగించిందని, ప్రయివేట్ భూముల రీసర్వేలో రోవర్లను ఉపయోగించకుండా కేవలం డ్రోన్ల ద్వారా తీసిన డిజిటల్ ఇమేజస్ (ఓఆర్ఎ)ల ఆధారంగా మాత్రమే రీసర్వే చేసిందని, దీంతో చాలా చోట్ల ప్రయివేట్ భూముల విస్తీర్ణంలో తేడాలు వచ్చాయని తెలిపారు. దీనికి తోడు రీసర్వేలో భాగంగా గ్రౌండ్ త్రూటింగ్(భూమిపై సర్వే) నిర్వహించే ముందు, నిర్వహించిన తర్వాత భూ యజమానులకు సరైన సమాచారం ఇవ్వలేదన్నారు.

రీసర్వే కాలం మొత్తాన్ని కేవలం 90 రోజుల్లోనే పూర్తి చేశారని, దీంతో సరైన ప్రమాణాలు పాటించకుండా హడావిడిగా రీసర్వే చేశారని అన్నారు. రీసర్వే చేసే సమయంలో భూ యజమానులు లేకపోవడం, వారి భూమి హద్దులు స్పష్టంగా చెప్పేవారు లేకపోవడంతో అధిక సంఖ్యలో జాయింట్ ల్యాండ్ పార్శిల్ లు మ్యాప్ ఏర్పడ్డాయన్నారు. రీసర్వే పూర్తయినప్పటికీ కారణంగా రైతులు ప్రభుత్వం నుండి పొందాల్సిన రుణాలు, రాయితీలను పొందలేకపోయారు. దీంతో రీసర్వే 1.0 పట్ల రైతులు ఆందోళన చెందారన్నారు.

ప్రజాధనం వృథాపై విమర్శలు

తన ప్రచార పిచ్చి కోసం జగన్ రెడ్డి రీసర్వే భూముల సరిహద్దు రాళ్లపై తన పేరు, బొమ్మను ముద్రించుకున్నారని, దీని వల్ల 660 కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని మట్టిపాలు చేశారని అన్నారు. దాదాపు 77,98,516 సర్వే రాళ్లను సేకరించి ఒక్కొరాయికి దాదాపు 846 రూపాయలు ఖర్చు చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రీ సర్వే 2.0ను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 19 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపణీ చేశామని, రీ సర్వే పూర్తయిన వరకు మరో 14 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందలన్నారు. కొత్త పాస్ పుస్తకంపై రాజముద్రతోపాటు డైనమిక్ క్యూర్ కోడ్ ను ముద్రించినట్లు చెప్పారు. మొత్తం 15 రకాల రక్షణ అంశాలను పాస్ పుస్తకాల్లో చేర్చినట్లు చెప్పారు. రీ సర్వే చేసిన గ్రామాల్లో తప్పులు సరిదిద్దేందుకు, రీ సర్వే చేయబోయే గ్రామాల్లో పకడ్బందీగా నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870