हिन्दी | Epaper

Employee Promotions: స్వర్ణ కార్యాలయ ఉద్యోగులందరికీ పదోన్నతులు

Anusha
Employee Promotions: స్వర్ణ కార్యాలయ ఉద్యోగులందరికీ పదోన్నతులు

Employee Promotions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ పేరును మార్చింది. ఇకపై వీటిని ‘గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాలు’గా పిలవనున్నారు. ఈ మార్పుకు సంబంధించిన సవరణ బిల్లును రాష్ట్ర గ్రామ, వార్డు స్వర్ణశాఖ మంత్రి శ్రీబాల వీరాంజనేయస్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లుకు అధికారికంగా ఆమోదం లభించింది.

Read Also: Speaker Ayyanna Patrudu: విశాఖ వేదికగా దక్షిణాది రాష్ట్రాల ఎమ్మెల్యేల క్రీడాపోటీలు

విధులపై గందరగోళం తొలగింపు.. పటిష్ట పర్యవేక్షణ

బిల్లు ఆమోదం పొందిన అనంతరం మంత్రి స్వామి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో సచివాలయ ఉద్యోగుల విధులు, బాధ్యతల విషయంలో ఉన్న గందరగోళాన్ని ప్రభుత్వం పూర్తిగా తొలగించిందని ఆయన స్పష్టం చేశారు. పరిపాలనను మరింత పారదర్శకంగా మార్చేందుకు జిల్లా, మండల, మరియు మున్సిపల్ స్థాయిల్లో పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు. దీనివల్ల ప్రజలకు సేవలు మరింత వేగంగా అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Employee Promotions: Promotions for all employees of the Golden Office
Employee Promotions: Promotions for all employees of the Golden Office

సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్: త్వరలో పదోన్నతులు

ఈ సందర్భంగా గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాల ఉద్యోగులకు మంత్రి తీపి కబురు అందించారు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు (ప్రమోషన్లు) కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. ఉద్యోగుల కెరీర్ వృద్ధికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని, అర్హులైన వారందరికీ త్వరలోనే ప్రమోషన్లు దక్కుతాయని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సచివాలయ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

గత 19 నెలల్లో గ్రామ, వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేశామన్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాలను జనాభాకు తగిన విధంగా వర్గీకరించామన్నారు.ఒకే పట్టణం, ఒకే డివిజన్, వార్డుల్లో రెండు, మూడు కార్యాలయాలు ఉన్నయాని గుర్తు చేశారు. వీటికి సంబంధించి స్థలం అందుబాటులోకి వస్తే వాటిని కూడా విభజిస్తామన్నారు. అవసరాలకు తగిన విధంగా గ్రామాల్లో వెటర్నరీ, ఉద్యాన, మత్స్య కార్యదర్శుల పోస్టులను రేషన్‌లైజేషన్‌ చేసినట్లు మంత్రి స్వామి తెలిపారు. అంతేకాదు గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయా స్టేషనరీ, ఇంటర్నెట్ ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.1000 చెల్లిస్తున్నట్లు కూాడా తెలిపారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870