Konda Bitragunta Brahmotsavam: బోగోలు మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రంలో వెలసియున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాలలో భాగంగా గురువారం నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరిగింది. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు గోవింద.. గోవింద..” నామస్మరణలతో కొండను మారుమోగించారు. అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ, కోలాటాలు ఆడుతూ, స్వామివారి జయజయధ్వానాల మధ్య భక్తులు కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
Read Also: Telangana: టీచర్ల పనితీరు ఆధారంగా ప్రమోషన్లు

చిన్నా పెద్దా తేడా లేకుండా కుటుంబ సమేతంగా పాల్గొన్న భక్తులు ఈ పవిత్ర యాత్రను భక్తి పారవశ్యంతో సాగించారు. బిలకూట క్షేత్రంలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి కలియుగ దైవంగా భక్తుల కోరికలను తీర్చే వేంకటరమణుడిగా ప్రసిద్ధి చెందారు. స్వామివారి కృపా కటాక్షం లభిస్తే జీవితంలో శాంతి, సౌఖ్యాలు, ఐశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ద్వారా పాప విమోచనం కలిగి, సకల శుభఫలాలు లభిస్తాయని శాస్త్రోక్తంగాశాస్త్రోక్తంగా భావిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించగా, పుష్పాలతో సింగారించిన స్వామివారి దర్శనం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి, ఉత్సవ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమాల ఏర్పాట్లను కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు మరియు నూతన దేవస్థాన కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. తాగునీరు, పారిశుద్ధం, భద్రత తదితర సౌకర్యాలు సమృద్ధిగా ఏర్పాటు చేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఇలాంటి భక్తి వాతావరణంలో గిరి ప్రదక్షిణ చేయడం మా పూర్వజన్మ సుకృతం” అని పలువురు భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
మొత్తంగా, కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగమైన గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తి, వైభవం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా విజయవంతంగా జరిగింది… గిరిప్రదర్శణ ఉభయకర్తలుగా దార్ల సుదర్శన్ రెడ్డి, గుడ్లదొన వారి కుటుంబ సభ్యులు, యస్, మురళీ కృష్ణ, దుప్పగుంట వెంకటేశ్వర్లు.. ఈ కార్యక్రమం ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, ఉభయకర్తలు, భక్తులు భారీగా పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: